మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ దిశగా దూసుకు పోతున్న విషయం తెలిసిందే. సినిమా బ్రేక్ ఈవెన్ ని 5 రోజుల టైం లోనే సొంతం చేసుకోగా తర్వాత మరింత బాగా హోల్డ్ చేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా ఇప్పుడు రవితేజ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచే సినిమాగా నిలవడానికి సిద్ధం అవుతుంది. ఇక సినిమా డిజిటల్…
హక్కులను రికార్డ్ రేటు కి కొన్నది ఆహా వీడియో… వాళ్ళ ప్లాట్ ఫాం లాంచ్ అయ్యాక అన్ని కూడా చిన్న లేదా మీడియం రేంజ్ మూవీస్ నే సొంతం చేసుకుంటూ వచ్చిన ఆహా వాళ్ళు మొదటి సారిగా హైయెస్ట్ రేటు పెట్టి కొన్న పెద్ద సినిమా రవితేజ క్రాక్ మూవీ…
ఈ సినిమా ను ఏకంగా 10.21 కోట్ల రేటు చెల్లించి హక్కులను రిలీజ్ కి ముందే ఒక ఒప్పందం తో చేసుకున్నారని సమాచారం. ఆ ఒప్పందం ప్రకారం సినిమా రిలీజ్ అయిన మూడు వారాల లోపే డిజిటల్ రిలీజ్ కూడా చేస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు.
దాంతో ఆ ఒప్పందం ప్రకారం సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకుని ఈ నెల 29 న ఆహా యాప్ లో రిలీజ్ కాబోతుందని వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇది నిజం కాదు అని ఇప్పటి వరకు క్రాక్ టీం నుండి ఎవ్వరూ కూడా కన్ఫాం చేయలేదు. దాంతో ఇది ఆల్ మోస్ట్ కన్ఫాం అయిన న్యూస్ అనే ఇప్పుడు అంతా భావిస్తున్నారు.
ఇక రవితేజ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ డిజిటల్ రేటు దక్కించుకున్న సినిమా అని చెప్పాలి. భారీ రేటు ఇచ్చిన కారణంగానే సినిమా డిజిటల్ రిలీజ్ ఇప్పుడు త్వరగా అవుతుంది అంటున్నారు. అప్పటికి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ రవితేజ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పాలి…