జనవరి 13 న మాస్టర్ సినిమా భారీ లెవల్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కి రిలీజ్ కి రోజు ముందు నుండే అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ లో జరిగాయి, ఇక థియేటర్స్ కౌంట్ ని మాత్రం రికార్డ్ లెవల్ లో కేటాయించారు. దాంతో ఆల్ రెడీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతున్న రవితేజ క్రాక్ సినిమా కి మాస్టర్ రిలీజ్ రోజున ఎంతవరకు థియేటర్స్ దక్కుతాయి…
అన్నది ఆసక్తిగా మారగా అందరికీ షాక్ ఇస్తూ మాస్టర్ రిలీజ్ రోజున వచ్చే సరికి డిస్ట్రిబ్యూటర్లు పేపర్స్ లో ఇచ్చిన థియేటర్స్ లెక్కలు మారిపోయాయి. 710 థియేటర్స్ లో రిలీజ్ అనుకుంటే మాస్టర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో కొంచం తగ్గి థియేటర్స్ ను సొంతం చేసుకుంది…
రిలీజ్ రోజు మాస్టర్ కి నైజాంలో 158 థియేటర్స్, సీడెడ్ లో 135 థియేటర్స్, ఆంధ్రాలో 280 థియేటర్స్ ని చూపెట్టారు. టోటల్ లెక్క 570 కి పైగా ఉందని సమాచారం…కానీ బుక్ మై షో లో మాత్రం ఎక్కువ థియేటర్స్ ని చూపెట్టడం విశేషం. ఇక మాస్టర్ రాకతో…
థియేటర్స్ ని భారీగా కోల్పోతుంది అనుకున్న క్రాక్ మాత్రం దుమ్ము దుమారం చేసింది. నైజాంలో 260 థియేటర్స్, సీడెడ్ లో 160 థియేటర్స్, ఆంధ్రాలో 320 థియేటర్స్ ని చూపెట్టారు. టోటల్ లెక్క 720 కి పైగా ఉందని సమాచారం.. సినిమా రిలీజ్ అవ్వడం 970 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది, అంటే మాస్టర్ కోసం 250 థియేటర్స్ ని మాత్రమే క్రాక్ సినిమా త్యాగం చేయాల్సి వచ్చింది.
కానీ బుక్ మై షో లో కొన్ని చోట్ల థియేటర్స్ లో క్రాక్ కొన్ని చోట్ల మాస్టర్ బుకింగ్స్ నడుస్తున్నాయి. ఓవరాల్ గా పేపర్ యాడ్ లో థియేటర్స్ కౌంట్ తో క్రాక్ సినిమా మాస్టర్ రిలీజ్ తో కూడా లీడ్ ని సొంతం చేసుకుంది, ఇక రెడ్ మరియు అల్లుడు శీను ల పోటి లో ఎన్ని థియేటర్స్ దక్కుతాయో చూడాలి ఇక…