Home న్యూస్ ఎన్టీఆర్ తో సినిమా పై కృష్ణవంశీ కామెంట్స్!!

ఎన్టీఆర్ తో సినిమా పై కృష్ణవంశీ కామెంట్స్!!

0

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నుండి మురారీ, ఖడ్గం లాంటి క్లాసిక్స్ వచ్చి చాలా కాలమే అయింది, లాస్ట్ మూవీ నక్షత్రం తో భారీ ఫ్లాఫ్ ని ఎదురుకున్న కృష్ణవంశీ ప్రస్తుతం కొత్త సినిమా మొదలు పెట్టె పని లో ఉన్నారు. ఇక రీసెంట్ గా సోషల్ మీడియా లో ఫాలోవర్స్ తో చిట్ చాట్ సెషన్ మొదలు పెట్టిన కృష్ణవంశీ అనేక టాపిక్స్ ని కవర్ చేశారు. అందులో ఎన్టీఆర్ తో సినిమా టాపిక్ కూడా రాగా…

కృష్ణవంశీ ఎన్టీఆర్ తో లవ్ స్టొరీ అడగ్గా ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్స్ నా కన్నా మంచి సబ్జెక్ట్ తీయగలరు అని చెప్పారు, ఇక రాఖీ సినిమా ఫ్లాఫ్ కాదని హిట్ కి కొద్ది దూరం లో ఆగిందని చెప్పారు. ఇక ప్రభాస్ నిజమైన బాహుబలి అని, మహేష్ అసలు సిసలు సూపర్ స్టార్ అని.

రామ్ చరణ్ మంచి మనసునున్న మనిషి అని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ.. ఇవన్నీ చెప్పినా కొత్త సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది అంటే మాత్రం సరైన ఆన్సర్ ఇవ్వలేదు కృష్ణ వంశీ.. ప్రస్తుతం పకడ్బందీ కథ రాసుకుని ఖడ్గం లాంటి క్లాసిక్ హిట్ కొట్టాలి అంటూ ఫాలోవర్స్ అందరు కృష్ణవంశీ ని కోరుతున్నారు. మరి కృష్ణవంశీ తన టాలెంట్ ని మరోసారి చూపెట్టి అలాంటి క్లాసిక్ ని ఇవ్వగలుగుతారో లేరో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here