Home న్యూస్ సత్యదేవ్ కృష్ణమ్మ ట్రైలర్ రివ్యూ….మాస్ రివేంజ్ డ్రామా!

సత్యదేవ్ కృష్ణమ్మ ట్రైలర్ రివ్యూ….మాస్ రివేంజ్ డ్రామా!

0

టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్స్ లో సత్యదేవ్(Satyadev) ఒకరు…అప్పట్లో డిజిటల్ లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న తర్వాత హీరోగా చాలానే సినిమాలు కమిట్ అయినా వాటిలో ఆడియన్స్ ను ఆకట్టుకున్న సినిమాలు చాలా తక్కువగానే ఉండగా ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత…

సత్యదేవ్ నటించిన కొత్త సినిమా కృష్ణమ్మ(Krishnamma Movie) ఆడియన్స్ ముందుకు ఈ నెల 10న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. కొరటాల శివ లాంటి టాప్ డైరెక్టర్ ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ లేట్ అవుతూ రాగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రానుండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూసిన చూస్తుంటే ఇంటెన్స్ రివేంజ్ డ్రామాగా అనిపిస్తూ ఉండగా రెగ్యులర్ మూవీగా అయితే అనిపించడం లేదు.. కృష్ణమ్మ ఊరిలో అల్లరి చిల్లరగా తిరగే 3 ఫ్రెండ్స్ అప్పుడప్పుడు దొంగ కేసుల్లో జైలుకు డబ్బుల కోసం వెళుతూ ఉంటారు, ఈ క్రమంలో అనుకోకుండా మరోసారి అలాగే వెళ్ళినప్పటికీ ఈ సారి కేసు…

చాలా పెద్దది అవ్వడంతో 3 ఫ్రెండ్స్ ని ఎవరు ఇరికించారు. వీళ్ళు ఎలా బయటపడి తమని ఇరికించిన వాళ్ళ మీద పగ తీర్చుకున్నారు అన్నది స్టోరీ పాయింట్ లా ట్రైలర్ లోనే ఆల్ మోస్ట్ కథని రివీల్ చేశారు…. ట్రైలర్ చూసిన తర్వాత డీసెంట్ ఔట్ పుట్ ఉండేలాంటి సినిమాలా అనిపిస్తున్న ఈ సినిమాతో…

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సత్యదేవ్ ఓ మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. మరి సినిమా ఎంతవరకు సత్యదేవ్ అంచనాలను నిజం చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర తనకి హిట్ సొంతం అయ్యేలా చేస్తుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here