Home టోటల్ కలెక్షన్స్ ఫ్లాఫ్ టాక్….25 కోట్ల బిజినెస్….టోటల్ కలెక్షన్స్ ఇవే!!

ఫ్లాఫ్ టాక్….25 కోట్ల బిజినెస్….టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఫ్లాఫ్ టాక్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. అలాంటి కోవలోకి వచ్చే లేటెస్ట్ మూవీ విజయ్ సేతుపతి, సమంత మరియు నయనతారలు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ కన్మణి రాంబో ఖతీజా… రీసెంట్ గా సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకోగా సోషల్ మీడియాలో…

అది ఫ్లాఫ్ టాక్ గా స్ప్రెడ్ అయింది… అయినా కానీ సినిమా కి ఓవరాల్ గా కలెక్షన్స్ మాత్రం సూపర్ సాలిడ్ గా సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా తెలుగు లో కూడా ఏకంగా 2.60 కోట్ల రేటు పెట్టగా తెలుగు లో మాత్రం సినిమా కి నష్టాలు తప్పలేదు…

టోటల్ రన్ లో సినిమా తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 60L
👉Ceeded: 25L
👉UA: 25L
👉East: 12L
👉West: 7L
👉Guntur: 12L
👉Krishna: 10L
👉Nellore: 7L
AP-TG Total:- 1.58CR(2.80Cr Gross)
తెలుగు బ్రేక్ ఈవెన్ 3 కోట్లు కాగా ఇక్కడ 1.4 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుంది.

ఇక సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యాక సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Tamilnadu – 39.10Cr
👉Karnataka- 4.15Cr
👉Telugu States – 2.80Cr
👉Kerala+ROI – 1.30CR~
👉Overseas – 17.90Cr(Approx)
Total WW collection – 65.25CR Approx
ఇదీ టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…

సినిమాను టోటల్ అన్ని చోట్లా కలిపి 25 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా సినిమా 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగింది. టోటల్ రన్ అయ్యాక సినిమా ఆల్ మోస్ట్ 33 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ 7 కోట్ల వరకు ప్రాఫిట్ ను దక్కించుకుని హిట్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here