Home న్యూస్ 2 సార్లు ఛాన్స్ ఇస్తే….బాలయ్య పై తీవ్ర కామెంట్స్ చేసిన డైరెక్టర్!

2 సార్లు ఛాన్స్ ఇస్తే….బాలయ్య పై తీవ్ర కామెంట్స్ చేసిన డైరెక్టర్!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) గురించి చాలా మంచి చెప్పే పాయింట్….బాలయ్యకి కోపం ఎక్కువ, అప్పుడప్పుడు ఎవరి మీదనైనా చేయి చేసుకుంటారు అని….ఆ కోపం కానీ అప్పుడప్పుడు బాలయ్య చేసే కొన్ని కామెంట్స్ కానీ సోషల్ మీడియాలో అలాగే ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కారణం అవుతాయి.

ఇక షూటింగ్ టైంలో కూడా బాలయ్య అప్పుడప్పుడు కోప్పడతారు అనేది చాలా మంది చెప్పే విషయమే. కానీ ఎవ్వరూ దీన్ని పెద్దగా కాంట్రవర్సీ చేయాలి అనుకోరు, కానీ ఫ్లాఫ్స్ లో ఉన్న టైంలో ఒక తమిళ్ సీనియర్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన బాలయ్య తను కూడా ఆ సినిమాతో కంబ్యాక్ ను సొంతం చేసుకోవడంతో…

మళ్ళీ మరో అవకాశాన్ని కూడా ఆ డైరెక్టర్ కి ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్ బాలయ్య మీద తీవ్రమైన కామెంట్స్ చేశారని చెప్పొచ్చు….ఆ డైరెక్టర్ మరెవరో కాదు కోలివుడ్ సీనియర్స్ లో ఒకరైన కే ఎస్ రవి కుమార్… బాలయ్య రవి కుమార్ ల కాంబినేషన్ లో జై సింహా లాంటి హిట్ మూవీ అలాగే రూలర్ లాంటి డిసాస్టర్ మూవీ వచ్చింది…

కాగా రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో మీడియా అందరి ముందు రవి కుమార్ బాలయ్య మీద కామెంట్స్ చేశారు…సినిమా షూటింగ్‌లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే బాలయ్య అస్సలు ఊరుకోరని. నవ్వే వాళ్ళు  తనని చూసి నవ్వుతున్నారని అనుకుంటాడు. వెంటనే కోపం తో నవ్వుతున్న వ్యక్తిని పిలిచి మరీ కొడతాడు. ఓ సినిమా షూటింగ్ లో నా అసిస్టెంట్ శరవణన్‌ను ఫ్యాన్ తీసుకురావాలని చెప్పగా అతను అనుకోకుండా ఫ్యాన్ బాలయ్య వైపు తిప్పడంతో బాలయ్య విగ్గు కాస్త అటు ఇటు అయింది.

దీంతో అసిస్టెంట్ శరవణన్ కొంచెం నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకు కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావ్ అని గట్టిగా అరిచాడు. ఆయన కోపం గురించి నాకు తెలిసిందే కాబట్టి ఎక్కడ శరవణన్‌ను కొట్టేస్తాడో అనిపించి.. అతను మన అసిస్టెంటే అని చెప్పి వెంటనే శరవణన్‌ను గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోమన్నాను.

అప్పటికి గాని బాలయ్య శాంతించలేదని కామెంట్స్ చేశారు రవికుమార్….ఇప్పుడు కామెంట్స్ కోలివుడ్ మొత్తం చక్కర్లు కొడుతూ ఉండగా టాలీవుడ్ లో కూడా చక్కర్లు కొడుతుంది. ఇలా ఒక డైరెక్టర్ ఓపెన్ ప్రెస్ మీట్ లో ఇలా ఒక సీనియర్ హీరోని కామెంట్ చేయడం అందరినీ ఆశ్యర్యపరుస్తుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here