తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా పరిచయం ఉన్న హీరో విశాల్. కొన్ని మంచి సినిమాలు పడ్డా కానీ ఎక్కువ శాతం నిరాశ కలిగించే సినిమాలను సొంతం చేసుకుంటూ వస్తున్న విశాల్ నటించిన లేటెస్ట్ ఎక్స్ పెరి మెంటల్ మూవీ లాఠీ…. ఎవ్వరికీ కష్టం వచ్చినా పోలిస్ దగ్గరకి వెళతారు, అలాంటిది పోలిస్ కే కష్టం వస్తే ఆ పోలిస్ ఏం చేశాడు అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా…
ఉన్నంతలో బాగానే రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా రివ్యూలోకి వెళితే సినిమా స్టొరీ పాయింట్ ఆల్ రెడీ చెప్పినట్లు సిన్సియర్ గా డ్యూటీ చేసే కానిస్టేబుల్ అయిన హీరో కి ఒక విలన్ తో జరిగిన గొడవ వలన… ఆ విలన్ హీరో ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు…
మరి హీరో ఎలా కష్టపడి ఆ విలన్ నుండి తన కొడుకుని కాపాడుకున్నాడు అన్నది సినిమా ఓవరాల్ స్టొరీ పాయింట్…. సినిమా కోసం విశాల్ చాలా కష్టపడ్డాడు, నాచురల్ యాక్టింగ్ తో మెప్పించాడు, కొన్ని రిస్కీ సీన్స్ కూడా చేశాడు, కానీ ఇంత కష్టపడినా సినిమా కథ అంతంత మాత్రమే ఉండటంతో విశాల్ పడ్డ కష్టం వృధా అయింది…
ఫస్టాఫే చాలా నెమ్మదిగా సాగగా సినిమా మొదలైన కొద్ది సేపటికే ఆడియన్స్ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించేస్తారు. తర్వాత ఆల్ మోస్ట్ ఆ ఊహలకు తగ్గట్లే సినిమా కథ ఉండగా సెకెండ్ ఆఫ్ అయినా బాగుంటుంది అనుకుంటే కొన్ని యాక్షన్ సీన్స్ మినహా సినిమా ఎక్కడా కూడా ఇంప్రెస్ చేయలేక పోయింది… లెంత్ ఎక్కువ అవ్వడం స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉండటం….
కథ సాగదీసినట్లు ఉండటంతో కొన్ని సీన్స్ మినహా సినిమా ఏ దశలో కూడా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేక పోయింది, విశాల్ పడ్డ కష్టం కోసం చాలా ఓపిక చేసుకుని సినిమా చూస్తె ఒకసారి అతి కష్టం మీద చూడొచ్చు అనిపించే లాఠీ పెద్దగా ఇంప్రెస్ చేయలేక పోయింది. ఎక్స్ పెరి మెంటల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ సినిమా చూడాలి అంటే చాలా ఓపిక అవసరం… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2 స్టార్స్….