Home న్యూస్ ఇంపాక్ట్ ఈ రేంజ్ లో ఉందా…షాకింగ్ అసలు!

ఇంపాక్ట్ ఈ రేంజ్ లో ఉందా…షాకింగ్ అసలు!

0

     ఎన్ని ఫ్లాఫ్స్ వచ్చిన తన అప్ కమింగ్ మూవీస్ కి పబ్లిసిటీ ని పీక్స్ లో సొంతం చేసుకునే కెపాసిటీ ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో కెల్లా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నుండి రాబోతున్న అప్ కమింగ్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం టోటల్ టాలీవుడ్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. తన కి నమ్మక ద్రోహం చేశాడు అంటూ…

చంద్రబాబు నాయిడు పై స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలను తర్వాత రాజకీయాల్లో 1989 లో ఓడి పోయిన తర్వాత ఎన్టీఆర్ జీవితం లో లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాత జరిగిన పరిణామాల నేపధ్యం లో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా…

ట్రైలర్ కి తొలి 24 గంటల్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రికార్డ్ లెవల్ లో 4.6 మిలియన్ వ్యూస్ ని ఏకంగా 1 లక్షా 87 వేల రేంజ్ లో లైక్స్ ని సాధించి అల్టిమేట్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకుంది, ఇక రీసెంట్ గా సినిమా ట్రైలర్ ఓవరాల్ గా డిజిటల్ వ్యూస్ పరంగా…

సోషల్ మీడియా లో 10 మిలియన్ వ్యూస్ ని అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ కలిపి సాధించి దుమ్ము లేపింది. దాంతో సినిమా ఇంపాక్ట్ ఈ రేంజ్ లో ఉంది చూడండి అంటూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా లో తన సినిమా ని మరింత జోరు గా ప్రమోట్ చేసుకుంటున్నాడు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం, ఎన్టీఆర్ మహానాయకుడు రిజల్ట్ చూసి ఈ సినిమా ని మంచి డేట్ కి రిలీజ్ చేయాలనే ఆలోచనలో రామ్ గోపాల్ వర్మ ఉన్నాడని తెలుస్తుంది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here