ఇది జరిగితే అఖిల్ ఫస్ట్ హిట్ కొట్టినట్లే!

1
1526

     కెరీర్ మొదలు పెట్టి 3 ఏళ్ళు అవ్వగా ఇప్పటి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్ అక్కినేని. కెరీర్ లో చేసిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక చతికిల బడ్డాయి. ముందుగా అఖిల్ మంచి జోష్ నడుమ వచ్చి అంచనాలు తప్పగా తర్వాత హలో టాక్ బాగున్నా పోటి వలన భారీ ఎదురుదెబ్బ తిన్నది, ఇక రీసెంట్ గా మిస్టర్ మజ్ను అన్నీ బాగున్నా కానీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ ఫలితం సొంతం చేసుకోలేక ఫ్లాఫ్ గా మిగిలి పోయింది, ఇలాంటి సమయం లో అఖిల్ చేయబోయే అప్ కమింగ్ మూవీ తో అయినా హిట్ కొట్టి తొలి సక్సెస్ ని సొంతం చేసుకుంటాడా లేదా అన్నది అందరి లోను ఆసక్తి రేపుతున్న ప్రశ్న గా చెప్పుకోవాలి.

కాగా తన అప్ కమింగ్ పై ఇండస్ట్రీ లో చాలానే రూమర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మైత్రి మూవీస్ లో అని, ఓన్ బ్యానర్ లో అని ఇలా పలు రకాల రూమర్స్ వినిపిస్తుండగా లేటెస్ట్ గా టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ లో ముందు ఉండే గీత ఆర్ట్స్ బ్యానర్ లో అఖిల్ నెక్స్ట్ మూవీ ఉండబోతుందని…

టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, గత కొన్నేళ్ళుగా టాలీవుడ్ లో గీత ఆర్ట్స్ నిర్మాణం లో వచ్చిన ప్రతీ సినిమా అంచనాలను అందుకుని సక్సెస్ గా నిలిచినా సినిమా నే… చివరి నికార్సయిన ఫ్లాఫ్ వచ్చి చాలా కాలమే అవుతుంది గీత ఆర్ట్స్ లో.

దాంతో ఈ వార్తా నిజం అయితే కచ్చితంగా అఖిల్ అక్కినేని కెరీర్ లో తొలి సక్సెస్ ని గీత ఆర్ట్స్ లో అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా కి దర్శకుడు ఎవరు ఇతర కాస్ట్ అండ్ క్రూ ఎవరు అన్న విషయాలు త్వరలో బయటికి వచ్చే అవకాశం ఉంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!