యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా సాలిడ్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న హీరోగా నిలిచాడు. సరైన సినిమా పడితే అవాలీలగా 60-70 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని మినిమమ్ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాల విజయాలు తనకి సాలిడ్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేయగా….
డియర్ కామ్రేడ్ అండ్ వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి డిసాస్టర్ మూవీస్ పడ్డా అవి కెరీర్ పై ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయాయి. ఇక ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో లైగర్ అనే బాక్సింగ్ బేస్ మూవీ చేస్తున్న…
విజయ్ దేవరకొండ ఈ సినిమా తో ఆల్ ఇండియా లెవల్ లో దుమ్ము లేపడం ఖాయమని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక రీసెంట్ గా సినిమా కి అన్ని భాషల్లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం ఊహకందని ఆఫర్ ని కోట్ చేశారట డిజిటల్ యాప్స్…
సోషల్ మీడియా లో 200 కోట్ల భారీ రేటు అంటూ ప్రచారం జరుగుతుంది కానీ అది రూమర్ అని తెలిసింది కానీ మొత్తం మీద డిజిటల్ రిలీజ్ అన్ని భాషలకి కలిపి చేస్తే 120 కోట్ల రేంజ్ రేటు ఇస్తామని ఆఫర్ చేశారట. ఇది మమ్మోత్ ఆఫర్ అని చెప్పొచ్చు, కానీ 200 కోట్ల ఆఫర్ రూమర్ కాగా ఆ రూమర్ గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ సినిమా…
థియేటర్స్ లో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది, ఈ ఆఫర్ చాలా చిన్న ఆఫర్ అంటూ సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ ఇండియా లెవల్ లో 200 కోట్లకి పైగా కలెక్షన్స్ తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో లేదో రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. కానీ ఈ రేంజ్ ఆఫర్ దక్కడం మాత్రం మెంటల్ మాస్ అనే చెప్పాలి.