కొత్త సినిమా వస్తే చాలు పైరసీ గొడవ తో పాటు ఇప్పుడు లోకల్ ఛానెల్స్ తో కూడా గొడవ అవ్వడం కామన్ అయిపొయింది, ఇది వరకు అంటే సినిమా లు థియేటర్స్ లో రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకటి రెండు నెలల తర్వాత మాస్టర్ ప్రింట్ రిలీజ్ అయ్యేది, సో అప్పటికే రన్ కంప్లీట్ అయిన కారణంగా సినిమాలను లోకల్ ఛానెల్ లో వేసినా కానీ పెద్దగా పట్టించుకునే వారు కాదు.
కానీ ఈ కరోనా టైం లో సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతున్న టైం లో కూడా లోకల్ ఛానెల్స్ అత్యుత్సాహంతో వచ్చిన సినిమా ను వచ్చినట్లు టెలికాస్ట్ చేస్తూనే ఉన్నాయి, ముందు ఇది పెద్దగా గమనించలేదు కానీ తర్వాత మాత్రం సినిమాలను….
నిర్మించిన వాళ్ళు అలాగే కొన్న వాళ్ళు కూడా దీనిపై వ్యతిరేకత ని వ్యక్తం చేస్తూ ఇలా చేసిన వాళ్లకి భారీ ఫైన్స్ కూడా వేస్తున్నా కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు ఎవ్వరూ. లేటెస్ట్ గా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ గా అంటే కేవలం అమెజాన్ వాళ్ళకే పరిమితం అయిన… నిశ్శబ్దం సినిమాను….
రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ చేయగా ప్రింట్ వచ్చిందో లేదో అప్పటికే పైరసీ కూడా అవ్వగా లోకల్ ఛానెల్స్ వాళ్ళు సినిమాను టెలికాస్ట్ చేయడం కూడా మొదలు పెట్టారు. హైదరాబాదు చెందిన లోకల్ ఛానెల్ లో కమింగ్ సూన్ అంటూ యాడ్స్ తో సినిమాను టెలికాస్ట్ చేశారట. దాంతో ఈ విషయం తెలుసుకున్న యూనిట్ ఇప్పుడు…
లోకల్ ఛానెల్ కి 1.1 కోట్ల ఫైన్ కట్టండి అంటూ నోటిసులు పంపినట్లు సమాచారం… ఒక్క టీం మాత్రమే కాకుండా అమెజాన్ ప్రైమ్ కూడా 30 లక్షల జరిమానా కట్టాలని నోటిసులు పంపిందట. దాంతో తర్వాత ఏం అవుతుంది అన్నది ఆసక్తి గా మారగా…. రీసెంట్ గా కొన్ని సినిమాల విషయం లో ఇలా భారీ ఫైన్స్ వేసినా కానీ ఈ ఛానెల్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు ఎందుకో…