Home గాసిప్స్ చిన్నా సినిమా అనుకున్నారు…లవ్ మీ మూవీ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా!!

చిన్నా సినిమా అనుకున్నారు…లవ్ మీ మూవీ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు(Dil Raju) తమ్ముడి కొడుకు ఆశిష్(Ashish) హీరోగా చేసిన మొదటి సినిమా రౌడీ బాయ్స్ సినిమా అంచనాలను అందుకోలేక భారీ ఫ్లాఫ్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత ఆశిష్ మరో సినిమాను మొదలు పెట్టినా అది మధ్యలోనే ఆగిపోగా ఆ సినిమా ప్లేస్ లో ఆశిష్ నటించిన…

కొత్త సినిమా లవ్ మీ(Love Me Movie) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద డీసెంట్ అంచనాలు అయితే నెలకొన్నాయి అని చెప్పాలి. మూసేసినా చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ ను ఇప్పుడు ఈ సినిమా తిరిగి రీ ఓపెన్ చేసే అవకాశం ఉండగా…

పేరుకు ఈ చిన్న స్టార్స్ నటించిన చిన్న సినిమానే అయినా కూడా బడ్జెట్ పరంగా భారీ ఎత్తున బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న మూవీ అని సమాచారం. మొదటి సినిమా రౌడీ బాయ్స్ కోసం ఆల్ మోస్ట్ 25 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ను పెట్టగా ఇప్పుడు రెండో సినిమా చిన్న సినిమాగానే స్టార్ట్ అయినా కూడా ఆల్ మోస్ట్…

ఈ సినిమా కోసం 22 కోట్లకు పైగా బడ్జెట్ ని పెట్టినట్లు ట్రేడ్ లో టాక్ ఉంది, ఇక పబ్లిసిటీ మరియు ఇతర ఖర్చులతో కలిపి 23.5 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ఈ సినిమాకి అయిందని అంటున్నారు, ఇక దిల్ రాజు తన బ్రాండ్ వాల్యూతో ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను మంచి రేటుకే అమ్మాడని ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి…

వచ్చే కలెక్షన్స్ తో కొద్ది వరకు కష్టపడితే మేకర్స్ కి డీసెంట్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు…. మొత్తం మీద ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న లవ్ మీ బడ్జెట్ పరంగా కొంచం మీడియం రేంజ్ మూవీస్ కి తీసిపోని విధంగా తెరకెక్కగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here