Home న్యూస్ లవ్ స్టొరీ USA బ్రేక్ ఈవెన్ టార్గెట్…..ఇక్కడ రేట్లు ఎంత పెంచారంటే!

లవ్ స్టొరీ USA బ్రేక్ ఈవెన్ టార్గెట్…..ఇక్కడ రేట్లు ఎంత పెంచారంటే!

0

ప్రస్తుతం యూత్ తో పాటు సినీ లవర్స్ చాలా ఆశగా ఎదురు చూస్తున్న సినిమాల్లో నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన లవ్ స్టొరీ సినిమా ముందు నిలుస్తుంది. ఈ సినిమా మొదలు అయినప్పటి నుండి మంచి క్రేజ్ ని మెయిన్ టైన్ చేస్తూ ఉండగా సమ్మర్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు…

ఈ నెల 24 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా బిజినెస్ వివరాలు ఒక్కొటిగా బయటికి వస్తూ ఉన్నాయి. కాగా సినిమాను ముందుగా ఓవర్సీస్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది, నాగ చైతన్య కెరీర్ లోనే ఇప్పటి వరకు…

ఈ సినిమా కి దక్కని రేంజ్ లో అత్యంత భారీ రిలీజ్ ను ఈ సినిమా కి ఇప్పుడు సొంతం చేయబోతున్నారట. కాగా సినిమా ఓవరాల్ ఓవర్సీస్ రేటు ఎంత అనేది ఇంకా బయటికి పెర్ఫెక్ట్ గా రిలీజ్ కాలేదు కానీ 2.5 కోట్ల రేంజ్ లో రేటు ని సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు.

కాగా ఈ లెక్కన సినిమా అక్కడ 1 మిలియన్ లోపు గ్రాస్ ను సొంతం చేసుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు సినిమా తెలుగు సినిమాలలోనే అమెరికాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ లో ఒకటి అనిపించే రేంజ్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న వేల అక్కడ ప్రింట్స్ అండ్ ఎక్స్ పెన్సెస్ కాస్ట్ చాలా పెరిగి పోతూ ఉండటం తో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్క్…

1.5 మిలియన్ దాకా సినిమా అక్కడ వసూల్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక నైజాంలో సినిమాకి టికెట్ హైక్స్ పర్మీషణ్ దక్కింది, సింగిల్ స్క్రీన్స్ లో 150, మల్టీ ప్లేక్సులలో 200 రేటుతో సినిమా రిలీజ్ కానుంది, ఆంధ్రలో పరిస్థితులు ఇంకా సెట్ కాలేదు… దాంతో ఇటు ఓవర్సీస్ లో భారీ రిలీజ్ నైజాం లో టికెట్ హైక్స్ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here