Home న్యూస్ మిక్సుడ్ టాక్….హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయిగా!

మిక్సుడ్ టాక్….హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయిగా!

0

ఆల్ మోస్ట్ రెండు నెలలుగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఆకట్టుకునే సినిమాలు ఏవి రాలేదు, అలాగే జనాలు కూడా ఎలక్షన్స్ అండ్ IPL మ్యాచుల వలన సినిమాలు రిలీజ్ చేయడానికి కూడా ఎవ్వరూ సిద్ధ పడలేదు…ఇలాంటి టైంలో ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు మూసేసిన సింగిల్ స్క్రీన్స్ ను…

తిరిగి తెరిపిస్తాము అంటూ చెప్పుకొచ్చిన దిల్ రాజు(Dil Raju) తమ్ముడి కొడుకు ఆశిష్(Ashish) హీరోగా నటించిన రెండో సినిమా లవ్ మీ(Love Me Movie) మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుంది…దాంతో కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది అనుకోగా…

దానికి విరుద్దంగా జనాలు సినిమాను చూడటానికి థియేటర్స్ కి వచ్చారు. శనివారం రిలీజ్ కూడా సినిమాకి కలిసి రాగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు మంచి ఆక్యుపెన్సీ సొంతం అవ్వగా ఈవినింగ్ షోలకు కూడా మంచి ఫుట్ ఫాల్స్ సొంతం అవ్వడం విశేషం, అలాగే కొన్ని చోట్ల సినిమా కి హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి…

మొత్తం మీద సినిమా మొదటి రోజు బుక్ మై షోలో కూడా టికెట్ సేల్స్ సాలిడ్ గానే జరగగా ఆల్ మోస్ట్ 24 గంటల్లో బుక్ మై షో లో 25.2 వేల టికెట్ సేల్స్ జరిగాయి. ఆల్ మోస్ట్ 2 నెలల గ్యాప్ లో వచ్చిన సినిమాల్లో ఒకటి రెండు సినిమాలను మినహాయించి లవ్ మీ మూవీకి మంచి బుకింగ్స్ మొదటి రోజు సొంతం అయ్యాయి. 

ఇక సినిమా టాక్ కనుక పాజిటివ్ గా వచ్చి ఉంటే మంచి కలెక్షన్స్ ని వీకెండ్ లో సొంతం చేసుకునే అవకాశం ఉంది. కానీ సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ రావడం కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపిస్తున్న ఓపెనింగ్స్ మాత్రం కొంచం అనుకున్న దానికన్నా బెటర్ గా సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here