Home న్యూస్ లవ్ స్టొరీ టోటల్ థియేటర్స్, బుకింగ్స్ రిపోర్ట్…ఫస్ట్ డే ఎంత రావొచ్చు!!

లవ్ స్టొరీ టోటల్ థియేటర్స్, బుకింగ్స్ రిపోర్ట్…ఫస్ట్ డే ఎంత రావొచ్చు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ క్రేజ్ సమ్మర్ లో రికార్డు లెవల్ లో రిలీజ్ అవ్వాల్సిన నాగ చైతన్య లవ్ స్టొరీ సినిమా పోస్ట్ పోన్ లు అవుతూ ఇప్పుడు సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ నుండి భారీ రిలీజ్ ను భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా గా నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉండగా…

సినిమా కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అందరి మైండ్ బ్లాంక్ చేసింది. సినిమా కి మొత్తం మీద 31.2 కోట్ల బిజినెస్ సొంతం అవ్వగా సినిమా ఇప్పుడు 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. కాగా ఈ బిజినెస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సెట్ ఇంకా కాక పొతే…

ఫస్ట్ వీక్ తర్వాత కొంచం తగ్గే అవకాశం ఎంతైనా ఉంది… ఇక సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే.. నైజాంలో 240 థియేటర్స్ లో, టోటల్ ఆంధ్రలో 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 640 థియేటర్స్ రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా….

900 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందు నుండే మొదలు అవ్వగా నైజాంలో రీసెంట్ మూవీస్ కన్నా బెటర్ బుకింగ్స్ ఉండగా వైజాగ్ లో సాలిడ్ గా బుకింగ్స్ సాగుతున్నాయి. ఆంధ్రలో మిగిలిన రీజన్స్ లో కూడా బుకింగ్స్ రీసెంట్ మూవీస్ కన్నా ది బెస్ట్ అనిపించే రేంజ్ లో ఉన్నాయి.

దాంతో ఈ బుకింగ్స్ ప్రకారం చూసుకుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 5 కోట్లకు పైగా షేర్ ని అందుకోవచ్చు. ఇక తొలిరోజు ఆటకి టాక్ పాజిటివ్ గా వచ్చి షో షోకి ఇంప్రూవ్ మెంట్ ను సొంతం చేసుకుంటూ పొతే ఈ లెక్క 6 నుండి 8 కోట్ల రేంజ్ కి వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here