Home న్యూస్ మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ రివ్యూ…సుదీర్ బాబు ఈ సారి హిట్ కొట్టేలా ఉన్నాడు!

మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ రివ్యూ…సుదీర్ బాబు ఈ సారి హిట్ కొట్టేలా ఉన్నాడు!

0

చాలా టైంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరోలలో సుదీర్ బాబు(Sudheer Babu) ఒకరు, రీసెంట్ టైంలో చేసిన సినిమా చేసినట్లు ఆడియన్స్ ను అలరించడంలో విఫలం అవుతూ ఉండగా, రెగ్యులర్ మూవీస్ లా కాకుండా కంటెంట్ ని నమ్ముకుని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు….

మా నాన్న సూపర్ హీరో(Maa Nanna Super Hero Movie) తో దసరా బరిలో నిలుస్తున్నాడు….ఈ సినిమా టీసర్ రిలీజ్ అయినప్పుడే ఆడియన్స్ ను ఈ క్లాస్ మూవీతో సుదీర్ బాబు ఈ సారి మెప్పించడం ఖాయమని అనిపించగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను…

రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత ఈ కథ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది అనిపించేలా ఆకట్టుకుంది అని చెప్పాలి. డబ్బుల కోసం కన్నా కొడుకుని వేరొకరికి ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు హీరో తండ్రి….తను తిరిగి రాకపోవడంతో…కొడుకుని పెంచిన వ్యక్తినే…

తండ్రిగా భావించే హీరో తన కోసం కష్టపడుతూ తన మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఈ క్రమంలో అనుకోకుండా తన ఒరిజినల్ తండ్రి తిరిగి వస్తాడు, ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన…

మా నాన్న సూపర్ హీరో సినిమా ట్రైలర్ హృదయానికి హత్తుకునే సీన్స్ తో బాగానే ఆకట్టుకుంది, రీసెంట్ టైంలో మాస్ రోల్స్ చేసిన సుదీర్ బాబు లుక్ ఫ్రెష్ గా బాగానే మెప్పించగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు బాగానే ట్రైలర్ లో ఆకట్టుకుంది…

ఓవరాల్ గా ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను పెంచేసి ఈ సారి సుదీర్ బాబుకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో కంబ్యాక్ సొంతం అవ్వొచ్చు అనిపించేలా ఆకట్టుకుంది, ఇదే నిజమయ్యి రిలీజ్ అయిన తర్వాత మెప్పిస్తే సుదీర్ బాబుకి డీసెంట్ హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here