తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ మారి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర నేడు భారీ గా రిలీజ్ అయింది. సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకే రోజు రిలీజ్ అవ్వగా ఎలాంటి ప్రమోషన్ పనులు లేకుండా సైలెంట్ గా వచ్చిన సినిమా ప్రేక్షకుల మనసు గెలిచిందో లేదో తెలుసుకుందాం పదండీ. ముందుగా స్టొరీ లైన్ విషయానికి వస్తే చెన్నై లో రౌడీ అయినా ధనుష్ ఆ ప్లేస్ ని వదిలేస్తాడు.
వేరే చోటు కి వెళ్ళగా అక్కడ కూడా కొన్ని అడ్డంకులు ఎదురు అవుతాయి. మరి హీరో ఆ అడ్డంకులను ఎలా ఎదురుకున్నాడు అన్నది అసలు కథ. స్టొరీ పాయింట్ కొంచం వీక్ గానే ఉన్నా సినిమా లో అలరించే సన్నివేశాలకు కొదవ లేదు.
హీరో ఎంట్రీ నుండి చివరి సీన్ వరకు ధనుష్ మారి లా అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపాడు, ఇక సాయి పల్లవి కూడా మాస్ రోల్ లో కుమ్మేసింది. యాక్షన్ సీన్స్, ఎంటర్ టైన్మెంట్ సీన్స్, సాంగ్స్ ఇలా అన్ని సినిమాలో సమపాళల్లో ఉండి ఆకట్టుకుంటాయి.
కానీ అన్ని ఉన్నా స్టొరీ ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండటం ఒక్కటే సినిమా కి మైనస్ పాయింట్…సెకెండ్ ఆఫ్ అక్కడక్కడా బోర్ కొడుతుంది, అది తప్పితే సినిమా మొత్తం అంచనాలకు ఏమాత్రం తప్పకుండా అలరిస్తుంది. మొత్తం మీద సినిమా…
తెలుగు ఆడియన్స్ కి కూడా నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. మంచి కామెడి అండ్ యాక్షన్ మూవీ ని చూడాలి అని కోరుకునే వారు మారి 2 కి వెళ్ళొచ్చు. ఫైనల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…
సినిమా కి మంచి ప్రమోషన్స్ చేసి ఉంటె సినిమా రీచ్ మరింతగా పెరిగి ఉండేది, రొటీన్ స్టొరీ లైన్ అండ్ ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండక పోయి ఉంటె సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ హిట్ గా చెప్పుకోవచ్చు…కానీ ఉన్నంతలో బెటర్ గా కుమ్మింది ఈ సినిమా..