Home న్యూస్ మద గజ రాజ 1st DAY తెలుగు కలెక్షన్స్!!

మద గజ రాజ 1st DAY తెలుగు కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విశాల్(Vishal) నటించిన మదగజరాజ(Madha Gaja Raja) మూవీ ఎప్పుడో 12 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా కాగా ఎట్టకేలకు రీసెంట్ గా తమిళ్ లో రిలీజ్ అయ్యి అక్కడ ఎక్స్  లెంట్ కలెక్షన్స్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది…తెలుగు లో రీసెంట్ గా డబ్ అయ్యి రిలీజ్ అయిన ఈ సినిమా…

బిజినెస్ లెక్కలు క్లియర్ గా ఏమి రివీల్ చేయలేదు కానీ ఓవరాల్ గా ఇక్కడ రిలీజ్ ను బట్టి డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 2.2 కోట్ల లోపు షేర్నీ అందుకోవాల్సిన అవసరం ఉంది….ఇక సినిమా తెలుగు లో రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను…

ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా సంతానం-విశాల్ ల కామెడీ సీన్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపిస్తున్న సినిమా మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే…

తెలుగు రాష్ట్రాల్లో 35-40 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 45-50 లక్షల లోపు గ్రాస్ ను ఫస్ట్ డే అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మొదటి రోజు ఇక్కడ డీసెంట్ ఓపెనింగ్స్ ను అందుకుందని చెప్పాలి ఇప్పుడు. టాక్ ఎలాగూ డీసెంట్ గానే ఉండటంతో సినిమా వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించేలా ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక మొదటి రోజు సినిమా అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here