Home న్యూస్ ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’ రీ రిలీజ్…సపోర్ట్ చేయమంటున్న ఫ్యాన్స్…రీజన్ ఇదే!!

ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’ రీ రిలీజ్…సపోర్ట్ చేయమంటున్న ఫ్యాన్స్…రీజన్ ఇదే!!

0

రీ రిలీజ్ ల ట్రెండ్ రీసెంట్ టైంలో బాగా పాపులర్ అయ్యి అంతే వేగంగా స్లో డౌన్ కూడా అయ్యింది, దానికి కారణం ఓవర్ గా రీ రిలీజ్ లు చేయడం, అలాగే థార్డ్ పార్టీ బయర్స్ కూడా ఇష్టం వచ్చినట్లు మంచి సినిమాలను రీ రిలీజ్ లు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉండటంతో కొన్ని సినిమాలకు ఇది వర్కౌట్ అయినా కూడా…

చాలా సినిమాలకు మాత్రం ఇది ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) రెండో సినిమాకే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎపిక్ మగధీర(Magadheera Re Release) సినిమాను ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…

పుట్టిన రోజు కానుకగా ఈ మార్చ్ 26న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు, కానీ సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు థార్డ్ పార్టీ బయర్స్ రిలీజ్ చేసే రీ రిలీజ్ లను మేం సపోర్ట్ చేయమంటూ ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇస్తున్నారు…

మగధీరతో పాటు నాయక్ మూవీ కూడా రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ చేయబోతూ ఉండగా ఈ సినిమాలకు మా సపోర్ట్ అస్సలు ఉండదని కన్ఫాం చేస్తున్నారు…ఈ సినిమాల ప్లేస్ లో మేం ఎప్పటి నుండో రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా చిరుత(Chiruta Re Release) రీ రిలీజ్ చేయండి అంటూ కూడా ట్రెండ్ చేస్తున్నారు….

ఆ సినిమా రైట్స్ వైజయంతి మూవీస్ వాళ్ళ దగ్గర ఉండటంతో ఆ సినిమాను రీ రిలీజ్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు…. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆ సినిమా టీం నుండి ఎలాంటి అప్ డేట్ లేక పోవడంతో మగధీర అండ్ నాయక్ సినిమాల రిలీజ్ కన్ఫాం అవ్వగా ఫ్యాన్స్ ఏ సినిమాకి సపోర్ట్ చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here