బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ సిద్దార్థ్ ల కాంబినేషన్ లో రూపొందిన మల్టీ స్టారర్ మూవీ మహా సముద్రం గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని 2 గంటల 35 నిమిషాల రన్ టైం తో బరిలోకి దిగడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు బయటికి వచ్చాయి. ఆ వివరాలను గమనిస్తే…
సినిమా మొత్తం మీద నాన్ థియేట్రికల్ బిజినెస్ ను గమనిస్తే… శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ కింద 18.5 కోట్ల రేటు పలికిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కింద 6 కోట్ల రేటు సొంతం చేసుకుందట. దాంతో నాన్ థియేట్రికల్ బిజినెస్ 24.5 కోట్ల రేటు సొంతం చేసుకోగా…
థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో 4 కోట్ల బిజినెస్ ను, సీడెడ్ లో 2.1 కోట్ల బిజినెస్ ను టోటల్ ఆంధ్రలో 6.5 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా 12.6 కోట్ల బిజినెస్ ను సాధించింది. ఇక సినిమా మిగిలిన చోట్ల బిజినెస్ లతో కలిపి…
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క 13.5 కోట్ల దాకా ఉందని సమాచారం. దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే వరల్డ్ వైడ్ గా 14 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. హిట్ టాక్ వస్తే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. ఇక సినిమా…
థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ లు రెండూ కలిపి 38 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను మొత్తం మీద సొంతం చేసుకుందని సమాచారం. సినిమా బడ్జెట్ లెక్కలు పూర్తిగా రివీల్ అవ్వలేదు కానీ కచ్చితంగా నిర్మాతకి మంచి ప్రాఫిట్స్ ని ఈ సినిమా ఇచ్చి ఉంటుంది. ఇక సినిమాను కొన్న వాళ్ళు ఎంతవరకు లాభాలను సొంతం చేసుకుంటారో చూడాలి ఇక.