Home గాసిప్స్ సెన్సేషనల్ న్యూస్…మహర్షి జూన్ 2న?

సెన్సేషనల్ న్యూస్…మహర్షి జూన్ 2న?

0

    సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహర్షి. మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మూవీ పై నెలకొన్న అంచనాలు అంతా ఇంతా కాదు, రెండు వరుస పరాజయాల తర్వాత భరత్ అనే నేను సినిమాతో సాలిడ్ కంబ్యాక్ చేసిన మహేష్ బాబు ఇప్పుడు మహర్షి సినిమాతో సమ్మర్ రేసులో ఎంటర్ అవ్వగా సినిమా రిలీజ్ డేట్ పై…

మొదటి నుండి కొంత సందిగ్ధత నెలకొనగా ముందుగా ఏప్రిల్ 5 న సినిమా రిలీజ్ అవుతుంది అని ప్రకటించినా కానీ అనుకోకుండా అమెరికాలో వీసా ప్రాబ్లంస్ వలన సినిమా షూటింగ్ లో డిలే అయ్యి సినిమా ఏప్రిల్ 25 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుందని నిర్మాత అనౌన్స్ చేశాడు.

కానీ ఒకరోజు తేడా తో టోటల్ వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేం రిలీజ్ ఉండటం తో ఓవర్సీస్ లో మహర్షి సినిమాకి ఇబ్బంది కలగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కానీ ఇప్పుడు ఆ డేట్ నుండి సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉందని ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఆంద్రప్రదేశ్ లో జరగబోతున్న ఎన్నికల ఫైనల్ డేట్ ఇంకా కన్ఫాం కాకుండా ఎక్కువ చాన్స్ ఏప్రిల్ చివరి వారంలో ఉంటుందని అంటున్నారు.

అదే జరిగితే సినిమాకి మరింత ఇబ్బంది ఉంటుంది కాబట్టి సేఫ్ సైడ్ లో సినిమాను సోలో గా ఎలాంటి పోటి లో రిలీజ్ చేయడానికి జూన్ 2 న డేట్ ని కూడా బ్లాక్ చేశారు అన్నది ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తున్న టాక్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది త్వరలోనే తెలియనుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here