ఇటు 180 అటు 350…టోటల్ కౌంట్ ఇదే!

0
259

     స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర. రాజకీయ ప్రయాణం లో చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషిస్తుండగా సినిమా పై అంచనాలు భారీ గా పెరిగి పోయాయి, తెలుగు మరియు మలయాళ వర్షన్స్ రెండు ఈ శుక్రవారం రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.

కాగా ఓవరాల్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న థియేటర్స్ కౌంట్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయింది. సినిమాను నైజాం ఏరియాలో సుమారు 180 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

ఇక సినిమా ఆంధ్ర మరియు సీడెడ్ లో సుమారు 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఓవరాల్ గా రెండు రాష్ట్రాల్లో 550 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది, ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో టోటల్ గా 100 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది.

ఇక మలయాళ వర్షన్ ని కేరళలో సుమారు 150 వరకు థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. దాంతో టోటల్ ఇండియా లో సినిమా 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఓవర్సీస్ మొత్తం మీద సినిమాను సుమారు 140 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ చేయనున్నారు.

దాంతో వరల్డ్ వైడ్ గా సినిమాను సుమారు 950 వరకు థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్ బయోపిక్స్ లో మహానటి మెప్పించగా ఎన్టీఆర్ కథానాయకుడు అంచనాలు అందుకోలేక పోయింది. ఇక ఇప్పుడు యాత్ర రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది ప్రతీ ఒక్కరి లోను ఆసక్తిని రేపుతుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!