Home న్యూస్ సౌత్ నం 1…సూపర్ స్టార్ రాంపేజ్!!

సౌత్ నం 1…సూపర్ స్టార్ రాంపేజ్!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి సోషల్ మీడియా లో తిరుగు లేని క్రేజ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ హీరోల్లో ముందుగా సోషల్ మీడియా లో ఎంటర్ అయిన మహేష్ ఫస్ట్ నుండే అందరి హీరోల మీద లీడ్ తో ట్విట్టర్ లో దూసుకు పోతున్నాడు. ఇక రీసెంట్ గా మహేష్ బాబు ట్విట్టర్ ఫాలోవర్స్ కౌంట్ సరికొత్త రికార్డ్ ను టాలీవుడ్ తరుపునే కాకుండా సౌత్ లో కూడా…

రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఏకంగా 10 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపాడు. సౌత్ లో మహేష్ బాబు మొట్ట మొదటి 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా సంచలనం సృష్టించాడు అని చెప్పాలి. టాలీవుడ్ లో మొదటి ప్లేస్ కి రెండో ప్లేస్ కి…

ఏకంగా 4 మిలియన్స్ రేంజ్ లో డిఫరెన్స్ ఉందీ అంటే మహేష్ బాబు ట్విట్టర్ లో ఎ రేంజ్ లో డామినేషన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఫేస్ బుక్ లో ప్రభాస్ అల్లు అర్జున్ లు, ఇన్స్ట గ్రామ్ లో విజయ్ దేవరకొండలు డామినేషన్ కొనసాగిస్తున్నారు…

మొత్తం మీద ట్విట్టర్ లో ప్రస్తుతం టాప్ మోస్ట్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరోల లేటెస్ట్ డాటాని ఒకసారి గమనిస్తే…
👉#MaheshBabu – 10 M
👉#RanaDaggubati – 6M
👉#Nagarjuna – 6M
👉#AlluArjun – 4.79M
👉#NTR – 4.24M
👉#PawanKalyan- 3.99M
👉#Nani – 3.74M
👉#Nithiin – 2.99M
👉#AkhilAkkineni – 2.65M
👉#VarunTej – 2.62M
వీళ్ళు మొత్తం మీద ట్విట్టర్ లో హైయెస్ట్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న తెలుగు హీరోలు..

ఇప్పుడు మహేష్ మొదటి 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఇక మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ప్రస్తుతం బ్యాంక్ సెట్ లో బిజీగా ఉండగా ఆ సెట్ పూర్తీ అయిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెడతారు అని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here