Home న్యూస్ కుంభస్థలం కొట్టేసిన మహేష్ ఫ్యాన్స్…ఆల్ టైం రికార్డ్ ట్రెండ్!!

కుంభస్థలం కొట్టేసిన మహేష్ ఫ్యాన్స్…ఆల్ టైం రికార్డ్ ట్రెండ్!!

0

     టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మరో రికార్డ్ ను నమోదు చేశారు, ప్రస్తుతం లాక్ డౌన్ కంటిన్యు అవుతున్న నేపధ్యంలో అందరూ ఇంట్లోనే ఉండటం చాలా బోర్ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి టైం లో సోషల్ మీడియా లో తమ హీరోల అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తూ మరో పక్క పాత సినిమాల యానివర్సరీ ట్రెండ్స్ లో ఫుల్ బిజీ అవుతున్నారు అందరు హీరోల ఫ్యాన్స్.

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ రీసెంట్ టైం లో వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకున్న తర్వాత నికార్సయిన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సమయం లో వచ్చిన భరత్ అనే నేను సినిమా రిలీజ్ అయ్యి నేటి తో 2 ఏళ్ళు పూర్తీ అయింది.

దాంతో సోషల్ మీడియా లో ఫ్యాన్స్ భారీ ఎత్తున ట్రెండ్ ని చేపట్టగా పాత రికార్డులను కొన్ని గంటల్లోనే బ్రేక్ చేసిన మహేష్ ఫ్యాన్స్ టాప్ ట్రెండ్ తో కుంభస్థలం కొట్టేశారు. ఓవరాల్ గా 24 గంటల్లో 2.75 మిలియన్ ట్వీట్స్ ని నమోదు చేసి ఆల్ టైం రికార్డ్ యానివర్సరీ ట్రెండ్ ని సృష్టించారు.

ఒక సారి మొత్తం మీద టాప్ 10 టాలీవుడ్ బిగ్గెస్ట్ యానివర్సరీ ట్రెండ్స్ ని గమనిస్తే
1) #2YEARSforBharatAneNenu-2.75M~**
2)#DecadeForMemorableAarya2: 1.21M*
3) #9YrsOfCultClassicORANGE: 831K
4) #8YrsForIHDookuduSensation: 676K
5) #1YearForVeeraRaghavaRage: 530K
6) #1YearforClassicJERSEY – 391.6K
7) #12YearsOfBBYamadonga: 353K
8) #4YearsForCultTEMPER: 325K
9) #7YearsForIHDookudu: 243K
10) #4YrsForWarriorGonaGannaReddy – 226k 
11) #3YrsOfTemperExplosion – 210K
ఇవీ ఓవరాల్ గా టాప్ 10 ప్లేసులలో నిలిచిన బిగ్గెస్ట్ యానివర్సరీ ట్రెండ్స్.

ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డ్ ట్రెండ్ ని బీట్ చేయాలి అంటే ఇతర హీరోలకు చాలా కష్టం అనే చెప్పాలి. త్వరలోనే మరిన్ని యానివర్సరీ ట్రెండ్స్ ఉండగా ఎ ట్రెండ్ భరత్ అనే నేను రికార్డ్ బ్రేకింగ్ ట్రెండ్ ని బ్రేక్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here