Home గాసిప్స్ సూపర్ స్టార్ మూవీ లో స్టార్ హీరో విలన్ రోల్!!

సూపర్ స్టార్ మూవీ లో స్టార్ హీరో విలన్ రోల్!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మూడు వరుస విజయాలతో హాట్రిక్ కొట్టిన జోరు లో ఉండగా కెరీర్ పీక్ టైం క్రేజ్ ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే, బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ తర్వాత సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ ఇప్పుడు రెట్టించిన జోరు తో తన కొత్త సినిమా ను డిఫెరెంట్ స్టొరీ పాయింట్ తో తెరకెక్కించ బోతున్న విషయం అందరికీ తెలిసిందే.

గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట అంటూ డిఫెరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా లో మహేష్ బ్యాంక్ ఎంప్లాయ్ గా కనిపించబోతున్నాడు. సినిమా మెయిన్ స్టొరీ పాయింట్, బ్యాంక్ నుండి వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన వ్యక్తిని…

హీరో ఎలా ఇండియా కి తీసుకు వచ్చాడు అన్నది కథ. కాగా ఈ పాయింట్ ప్రకారం హీరో కి తగ్గ పోటి ఇచ్చే రేంజ్ లో విలన్ కూడా ఉండాలి, అందుకోసమే ఇప్పుడు మరో ఇండస్ట్రీ స్టార్ హీరో ని ఇందులో విలన్ రోల్ లో తీసుకోబోతున్నారు అన్నది లేటెస్ట్ ఇండస్ట్రీ న్యూస్.

ఆ విలన్ ఎవరో కాదు…కన్నడ స్టార్ హీరో కిచ్చ సుధీప్… ఆల్ రెడీ తెలుగు లో ఈగ సినిమా తో విలన్ గా ఎంట్రీ ఇచ్చి అడపా దడపా సినిమాల్లో కనిపించి అందరికీ సుపరిచితుడే అయ్యాడు. తన విలనిజం తో మెప్పించడం ఈ హీరో స్పెషాలిటీ అని చెప్పాలి. అందుకే ఈ సినిమా లో ఉండే పవర్ ఫుల్ విలన్ రోల్ కి..

కిచ్చ సుదీప్ ని అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది, కానీ ఇంకా సుధీప్ నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే తన నిర్ణయం చెబుతారని, అప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ కి కొంత టైం పడుతుందని, పరిస్థితులు అన్నీ సద్దుకున్నాకే సినిమా సెట్స్ మీదకి వెళుతుందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here