Home న్యూస్ యునానిమస్ హిట్ టాక్…ఆ బడ్జెట్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి సామి!!

యునానిమస్ హిట్ టాక్…ఆ బడ్జెట్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి సామి!!

0

ఆల్ మోస్ట్ 8-9 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయిన సినిమా ఆడియన్స్ ను థియేటర్స్ రప్పించాలి అంటే ఆ సినిమాకి అనుకున్న దాని కన్నా కూడా చాలా మంచి పాజిటివ్ టాక్ అవసరం, అలాంటి టాక్ ను కూడా సొంతం చేసుకున్నాక ఇక బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు సరికాదా…

కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది అజయ్ దేవగన్(Ajay Degvn) నటించిన మైదాన్(Maidaan Movie) సినిమా…ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అనేక సార్లు పోస్ట్ పోన్ అవ్వగా ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు ఈ రంజాన్ కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. సినిమాకి యునానిమస్ పాజిటివ్ రివ్యూలు కూడా సొంతం అయ్యాయి.

కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది ఈ సినిమా…ఈ సినిమా కోసం అప్పట్లోనే ఆల్ మోస్ట్ 180-200 కోట్ల బడ్జెట్ పెట్టారట. ఇక రిలీజ్ పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ అవ్వడంతో ఇంటరెస్ట్ లు వడ్డీలు పెరిగి పెరిగి ఆల్ మోస్ట్ 250 కోట్ల రేంజ్ లో బడ్జెట్ అయ్యిందని సమాచారం..

కానీ సినిమా 6 రోజుల్లో ఇండియాలో యునానిమస్ హిట్ టాక్ తో కేవలం 25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఓవర్సీస్ లో కేవలం 7 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను సినిమా సొంతం చేసుకుంది..దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా 40 కోట్ల లోపు గ్రాస్ ను మాత్రమె సొంతం చేసుకుని అత్యంత తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది….

బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హీరో నటించిన సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకున్న తర్వాత రీసెంట్ టైంలో ఇలా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోవడం మాత్రం ఈ సినిమాకే చెల్లింది అని చెప్పాలి, అనేక సార్లు పోస్ట్ పోన్ అవ్వడం సినిమా రిజల్ట్ పై తీవ్రమైన ఇంపాక్ట్ ను చూపించింది అని చెప్పొచ్చు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here