యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే వసూళ్ళ తో జోరు చూపుతూ దూసుకు పోతుంది, సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 21.5 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి దుమ్ము లేపింది ఈ సినిమా. ఎలేక్షన్స్ అయిపోవడం తో ఈవినింగ్ అండ్ నైట్ షోల కి జనాలు కొంచం ఎక్కువగానే ఎగబడ్డారు.
దాంతో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ చాలా వరకు ఇంప్రూవ్ అయినట్లు తెలుస్తుంది, అది నిజం అయితే 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మజిలీ మరోసారి అద్బుతమైన వసూళ్ళ ని అందుకునే అవకాశం ఉంది, సేఫ్ సైడ్ లో 5 వ రోజు తక్కువ లో తక్కువ సినిమా…
రెండు తెలుగు రాష్ట్రాలలో 1.6 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు, ఫైనల్ నంబర్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఉంటుంది, ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు కూడా మినిమమ్ 1.8 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. అంటే 4 వ రోజు తో పోల్చితే…
5 వ రోజు కేవలం 20% నుండి 25% లోపు డ్రాప్స్ మాత్రమే సొంతం చేసుకున్నట్లు లెక్క. ఈ అడ్వాంటేజ్ తో వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ దూసుకు పోతున్న మజిలీ లాంగ్ రన్ లో మరింత జోరు చూపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
కొత్త సినిమాలు వారానికి ఒకటి వస్తుండగా రెండో వారం కొత్త సినిమాని తట్టుకుని నిలబడితే సినిమా 2 వారాల్లోనే నాగ చైతన్య కెరీర్ బెస్ట్ రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక 5 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.