Home న్యూస్ మనమే మూవీ ప్రీమియర్స్ టాక్ ఏంటి…హిట్టా-ఫట్టా!!

మనమే మూవీ ప్రీమియర్స్ టాక్ ఏంటి…హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 2 ఏళ్ల గ్యాప్ తర్వాత శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie REVIEW) సినిమా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న సినిమాకి అక్కడ నుండి ఎలాంటి టాక్ ఇప్పుడు సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా….

సినిమా కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయలేదు కానీ హీరో లండన్ లో ప్లే బాయ్ లా తిరుగుతూ ఉండగా అనుకోని పరిస్థితులలో హీరోయిన్ తో పెళ్లి చేసుకోవాల్సి రాగా అక్కడ నుండి హీరో లైఫ్ లో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు, హీరోయిన్స్ ల గిల్లికజ్జాలు ఎలా సాగాయి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు…

సినిమా ఫస్టాఫ్ కథ యావరేజ్ లెవల్ లో ఉన్నప్పటికీ రిచ్ విజువల్స్, అక్కడక్కడా లైట్ కామెడీ సీన్స్ అండ్ మంచి మ్యూజిక్ వలన టైం పాస్ గా సాగుతూ మెప్పించగా సెకెండ్ ఆఫ్ కథ కొంచం అక్కడక్కడా సీరియస్ టర్న్ తీసుకున్నా కూడా పడుతూ లేస్తూ సినిమా పర్వాలేదు అనిపించేలా సాగుతుందని అంటున్నారు…

శర్వానంద్ కృతి శెట్టి ల పెర్ఫార్మెన్స్, ఇద్దరి కెమిస్ట్రీ అలాగే మ్యూజిక్ సినిమా కి ప్లస్ పాయింట్ గా నిలిచాయని, అలాగే కొన్ని చోట్ల సింగిల్ లైన్ డైలాగ్స్ కూడా బాగానే హైలెట్ అయ్యాయని అంటున్నారు…. పెద్దగా ఎక్స్ పెర్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి సినిమా ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించడం ఖాయమని అంటున్నారు…

మొత్తం మీద ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న మనమే మూవీ కి అక్కడ నుండి ఎబో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుందని అంటున్నారు… ఇక రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి ఇదే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకున్నా మంచి రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక సినిమాకి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here