శర్వానంద్(Sharwanand) కృతి శెట్టి(Krithi Shetty) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie REVIEW RATING) సినిమా ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. క్లాస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ మూవీలా అనిపించిన ఈ సినిమాతో శర్వానంద్ ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పించాడో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే లండన్ లో ప్లే బాయ్ లా ఉండే హీరో అనుకోకుండా ఇండియా తిరిగి రావాల్సి వస్తుంది, అప్పుడు అనుకోకుండా హీరోయిన్ తో కలిసి ఓ పిల్లాడి బాద్యతలు వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది….మరి హీరో హీరోయిన్స్ ల మీద పడ్డ ఆ భాద్యతను వీళ్ళు ఎలా మోశారు…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
శర్వానంద్ ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకున్నాడు, కొన్ని సీన్స్ లో కామెడీ, సింగిల్ లైన్ పంచులు బాగా మెప్పించగా సెంటిమెంట్ సీన్స్ కూడా మరోసారి బాగా నటించాడు, హీరోయిన్ కృతి శెట్టి తన రోల్ వరకు బాగానే నటించి మెప్పించగా, స్పెషల్ రోల్ లో సీరత్ కపూర్ కూడా మెప్పించింది… మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో బాగానే నటించారు…
సినిమాలో పాటలు చాలా ఉన్నాయి, ప్రతీ 5-10 నిమిషాలకు ఒక బిట్ సాంగ్ వస్తుంది….కొన్ని బాగుండగా ఒక స్టేజ్ తర్వాత పాటలు మరీ ఎక్కువ అయ్యాయి అనిపించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మరింత షార్ప్ గా ఉండాల్సింది, ఫస్టాఫ్ వరకు పర్వాలేదు కానీ సెకెండ్ ఆఫ్ లో రన్ టైం ని తగ్గించి ఉంటే బాగుండేది….
ఇక సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ…విజువల్స్ ఎంత గ్రాండియర్ గా ఉన్నాయంటే కొన్ని చోట్ల వీక్ సీన్స్ కూడా విజువల్స్ తో మాయ చేశారు….సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్స్ లెంట్ గా ఉన్నాయి. ఇక డైరెక్టర్ శ్రీరాం ఆదిత్య ఎంచుకున్న పాయింట్ చాలా సింపుల్ గానే ఉన్నా కూడా….
ఫ్యామిలీ ఎమోషన్స్ ని, సెంటి మెంట్ సీన్స్ ను కొన్ని చోట్ల డీసెంట్ కామెడీని బాగా మ్యానేజ్ చేశాడు…కొద్ది వరకు కథ హాయ్ నాన్న సినిమాను గుర్తు చేసినట్లు అనిపించింది….సెకెండ్ ఆఫ్ ను కొంచం బెటర్ గా డీల్ చేసి పాటలు మరీ ఎక్కువ పెట్టకుండా ఉండి ఉంటే సినిమా ఇంకా బాగుండేది అనిపించింది…అలాగే లెంత్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది…
మొత్తం మీద సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా రీసెంట్ టైంలో వచ్చిన క్లీన్ మూవీస్ లో ఈ సినిమా ఒకటి అని చెప్పొచ్చు, ట్రైలర్ చూసి పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ అనుకుని వెళితే సినిమాలో సెంటిమెంట్ అండ్ కొంచం డ్రాగ్ వలన ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వొచ్చు ఏమో కానీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి…
కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్స్ అనిపించినా ఓవరాల్ గా సినిమా అయ్యే సరికి మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ సినిమాగా అనిపించేలా ఉంటుంది మనమే మూవీ…ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా కొంచం ఎక్కువగా నచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…