Home న్యూస్ ఇది కదా శర్వా నుండి కోరుకునేది…కుమ్మేసిన మనమే ట్రైలర్ రివ్యూ!!

ఇది కదా శర్వా నుండి కోరుకునేది…కుమ్మేసిన మనమే ట్రైలర్ రివ్యూ!!

0

ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా మరియు మహానుభావుడు లాంటి మంచి కామెడీ ఎంటర్ టైనర్ లతో మంచి సక్సెస్ లను సొంతం చేసుకున్న శర్వానంద్(Sharwanand) నటించిన తర్వాత సినిమాల్లో ఒకటి రెండు సినిమాలు పర్వాలేదు అనిపించినా కూడా ఆశించిన సక్సెస్ అయితే ఇంకా సొంతం అవ్వాల్సిన అవసరం ఉండగా…

ఇప్పుడు ఆడియన్స్ ముందుకు శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మనమే(Maname Movie) మూవీ ఈ నెల 7న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత ఇది కదా శర్వానంద్ నుండి ఆడియన్స్ కోరుకునే సినిమా అనిపించడం ఖాయం….

యంగ్ పేరెంట్స్ అయిన హీరో హీరోయిన్స్ ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు…కొడుకు భాద్యతలను తల్లి తండ్రికి అప్పగించి ఇతర పనులను చూసుకుంటూ ఉండగా పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని తండ్రి ఏమేమి చేశాడు వీళ్ళ గిల్లికజ్జాలు ఎలా సాగాయి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

కంప్లీట్ గా ఎంటర్ టైన్ మెంట్ ను మిక్స్ చేసి తీసిన మనమే ఒకప్పటి ఎంటర్ టైనర్ శర్వానంద్ ని తిరిగి గుర్తు చేయగా ట్రైలర్ హిలేరియస్ గా మెప్పించింది అని చెప్పాలి. సినిమా కూడా ట్రైలర్ ఉన్నట్లు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అండ్ సెంటిమెంట్ కొంచం ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ కి సాలిడ్ హిట్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here