Home న్యూస్ మరక్కార్ ట్రైలర్ రివ్యూ…అదిరిపోయింది….కానీ!!

మరక్కార్ ట్రైలర్ రివ్యూ…అదిరిపోయింది….కానీ!!

0

రిలీజ్ కి ముందే నేషనల్ అవార్డులను గ్రాఫిక్స్ విభాగంలో సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సెన్సేషనల్ మూవీ మరక్కార్ లయన్ ఆఫ్ అరేబియన్ సీ ఎప్పటి నుండో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అవుతుంది అనుకుంటే కేరళ డిస్ట్రిబ్యూటర్లు రిక్వెస్ట్ మేరకు థియేటర్స్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకుని డిసెంబర్ 3న రిలీజ్ కానుంది.

కాగా సినిమా తెలుగు ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ ఓవరాల్ గా అద్బుతమైన విజువల్స్ అండ్ గ్రాండియర్ గా అడుగడుగునా ప్రొడక్షన్ వాల్యూస్ మరో లెవల్ లో ఆకట్టుకున్నాయి. స్టొరీ పాయింట్ కూడా ఓ పోరాట వీరుడైన కుంజాలి మరక్కార్ ని అడ్డుకోవడానికి…

6000 మంది సైన్యంతో వచ్చిన బ్రిటిష్ వాళ్ళని హీరో అలాగే హీరో బృందం ఎలా అడ్డుకున్నారు అన్న పాయింట్ తో తెరకేక్కున్న ఈ సినిమా ట్రైలర్ మెస్మరైజ్ చేసింది కానీ ఇలాంటి పైరేట్స్ ఆఫ్ కరేబియన్ టైప్ సినిమాలు చూడానికి ఎంతమంది ఇష్టపడతారో చెప్పలేం. బాలీవుడ్ వాళ్ళు ఇలాంటి కాన్సెప్ట్ తోనే తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ పేరుతొ సినిమా ట్రై చేసినా దెబ్బకొట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here