బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ మట్కా(Matka Movie 1st Day Collections) భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు రాగా సినిమా మీద వరుణ్ తేజ్ భారీ హోప్స్ ను పెట్టుకోగా, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం…
పోటిలో ఉన్న కంగువ(kanguva) మూవీను తట్టుకుని బిలో పార్ రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే దిశగా పరుగును కొనసాగిస్తూ ఉండగా, మరీ మునుపటి వరుణ్ తేజ్ ఓపెనింగ్స్ నీ మ్యాచ్ చేయడం లేదు…కానీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాస్ సెంటర్స్ లో…
బుక్ మై షో లో మినిమమ్ ట్రెండ్ ను కూడా చూపించలేకపోతున్న ఓపెనింగ్స్ ను అందుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా పెద్దగా ట్రెండ్ కనిపించడం లేదు…. మొదటి రోజు మొత్తం మీద ఇప్పుడు పోటిలో 40-50 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా….
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే 60 లక్షల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం ఉంది. 2 కోట్లు 2.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వస్తే సినిమా మంచి స్టార్ట్ ను సొంతం చేసుకుందని చెప్పొచ్చు, కానీ దానికి ఆఫ్ లైన్ లో రిమార్కబుల్ ట్రెండ్ ఉండాల్సిన అవసరం ఉంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 80L-ఒక కోటి రేంజ్ లోపు ఓపెనింగ్స్ ను ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకోవచ్చు, ఓవరాల్ గా సినిమా వీకెండ్ లో ఊహకందని రేంజ్ లో గ్రోత్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.