కీరవాణి అబ్బాయిలు శ్రీ సింహా హీరో కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన లేటెస్ట్ మూవీ మత్తు వదలరా… అందరు కొత్త కుర్రాళ్ళతో చేసిన ఈ ప్రయత్నానికి ఎస్ ఎస్ రాజమౌళి బ్రాండ్ తో మంచి పబ్లిసిటీ దక్కింది, దాంతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇది వరకే రిలీజ్ అయిన ఇతర సినిమాల పోటి ని తట్టుకుని ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందో ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ కి వస్తే చేసే కొరియర్ బాయ్ జాబ్ లో డబ్బులు మిగడం లేదని, ఇక ఊరికి వెలిపోదాం అనుకుంటున్నా హీరో కి తన ఫ్రెండ్ ఒక ఐడియా ఇస్తాడు. ఆ ఐడియా ని ఫాలో అయిన హీరో అనుకోకుండా ఓ పెద్ద సమస్య లో ఇరుక్కోగా తర్వాత తన ఫ్రెండ్స్ కూడా ఇరుకుంటారు.
మరి ఆ సమస్య ఏంటి, ఆ సమస్య నుండి హీరో అండ్ ఫ్రెండ్స్ ఎలా బయట పడ్డారు అన్నది మొత్తం మీద సినిమా కథ. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీ సింహా మొదటి సినిమానే అయినా ఉన్నంతలో మెప్పిస్తాడు. డైలాగ్స్ యాక్టింగ్ మరింత మెరుగు అవ్వాల్సిన అవసరం ఉంది.
ఇక సత్య కామెడీ దుమ్ము లేపగా మరో కొత్త కుర్రాడు నరేష్ అగస్త్య కూడా ఆకట్టుకున్నారు, ఇక సెకెండ్ ఆఫ్ లో అతుల చంద్ర అనే మరో అమ్మాయి క్యారెక్టర్ కూడా బాగా ఆకట్టుకుంది, ఇక మిగిలిన స్టార్ కాస్ట్ సినిమాలో తమ పరిది మేర ఆకట్టుకుంటారు.
సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి తగ్గట్లు ఉన్నాయి.. పాటలు యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే బాగుండగా అక్కడక్కాడా కొంచం స్లో అవుతుంది సినిమా, ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
డైరెక్షన్ పరంగా కొత్త కథ ని మరింత కొత్తగా చెప్పే ప్రయత్నంలో చాలా వరకు సఫలం అయ్యాడు డైరెక్టర్.. ఫస్టాఫ్ వరకు కామెడి సస్పెన్స్ తో దూకుడు పెంచినా మంచి పాయింట్ తో ఇంటర్వెల్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచి సెకెండ్ ఆఫ్ ని మరీ ఫస్టాఫ్ రేంజ్ లో కాకుండా పర్వాలేదు అనిపించాడు డైరెక్టర్.
సినిమా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే… కామెడీ, శ్రీ సింహ పెర్ఫార్మెన్స్, సినిమాలో కొత్తదనం లాంటివి ఆకట్టుకోగా, మైనస్ ల విషయానికి వస్తే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడమ్, మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్లు ఉండటం తో మాస్ కి పెద్దగా కనెక్ట్ కాకపోవడం లాంటివి మైనస్ లుగా చెప్పాలి.
మొత్తం మీద సినిమా కొత్తదనం కోరుకునే వారికి, డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వారికి నచ్చుతుంది, రొటీన్ మూవీస్ చూసే వారికి కామెడీ ఎక్కుతుంది కానీ మిగిలిన సినిమా ఎదో బానే ఉంది అనిపిస్తుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా తక్కువే…
మొత్తం మీద సినిమా మా రేటింగ్ [3 స్టార్స్]… మంచి సినిమానే కానీ పరిమితులు ఉన్నాయి.. ఆడియన్స్ ఇతర సినిమాలు ఆల్ రెడీ చూసేసి ఉంటే ఈ సినిమా ని ఒకసారి ట్రై చేయోచ్చు, చాలా వరకు సినిమా మెప్పించే అవకాశం ఉంది.