Home న్యూస్ కేరళ బాహుబలి “మామంగం” పరిస్థితి తెలిస్తే షాక్!!

కేరళ బాహుబలి “మామంగం” పరిస్థితి తెలిస్తే షాక్!!

0

  బాహుబలి రాకతో భారీ బడ్జెట్ మూవీస్ అన్ని ఇండస్ట్రీ లలో పెరిగి పోగా లేట్ గా అయినా లేటెస్ట్ గా కేరళ ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా అక్కడ ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 80 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించిన సినిమా “మామంగం”. రీసెంట్ గా సౌత్ తో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆటకే అన్ని చోట్లా డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.

బాహుబలి లా భారీ గ్రాండియర్ ఉన్నప్పటికీ కథ లో పట్టు లేకపోవడం కథనం చాలా నీరసంగా ఉండటం దానికి తోడూ మలయాళ ఫ్లేవర్ ఉండాల్సిన దానికన్నా మరీ ఎక్కువగా ఉండటం తో తెలుగు ఆడియన్స్ అసలు సినిమాను పట్టించుకొనే లేదు. సినిమా కథ పాయింట్ ఏంటి అంటే…

దేవుడు అంటే నమ్మే వాళ్ళు కొందరు నమ్మని వాళ్ళు కొందరు, వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది, ఇది క్రమం తప్పకుండా 10-11 ఏళ్ల కొకసారి జరుగుతుంది, దీనిలో చాలామంది చనిపోతారు, ఇక చివరగా ఒక బాబు మాత్రమె మిగలగా విలన్స్ ని చంపడానికి ఆ బాబుకి తోడుగా మమ్ముట్టి ఉన్ని ముకుందన్ లాంటి వాళ్ళు నిలుస్తారు, వీళ్ళు ఎలా గెలిచారు అన్నది కథ.

స్లో నరేషన్, ఓవర్ మలయాళ ఫ్లేవర్ తో సినిమా చాలా బోర్ కొట్టిస్తుంది, కొన్ని ఆకట్టుకునే సీన్స్ అదిరి పోయే బ్యాగ్రౌండ్ స్కోర్ తప్పితే మిగిలినవన్నీ మైనస్ పాయింట్స్.. ఇది కేరళ బాహుబలి అంటూ ప్రచారం చేసినా బాహుబలి లో ఉన్న మెయిన్ స్టొరీ అది భాష కి సంభందం లేకుండా అన్ని ఇండస్ట్రీ లకు కనెక్ట్ అయ్యే అప్పీయరెన్స్ లాంటివి పట్టించుకోకుండా…

బడ్జెట్ ఉంది కదా అని భారీ సినిమాలు తీయడం వాటిని ఇతర భాషల్లో డబ్ చేయడం ఆ సినిమా కి ఇనీషియల్ క్రేజ్ తెస్తుందేమో కానీ విజయాన్ని తేవదు. ఇప్పుడు మామంగం పరిస్థితి కూడా ఇదే. తెలుగు లో బిజినెస్ తెలియదు కానీ 2 రోజుల్లో పట్టుమని 15 లక్షల షేర్ కూడా సాధించలేదు ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here