లాక్ డౌన్ వలన అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే, ఈ ఇయర్ సాలిడ్ స్టార్ట్ తెలుగు సినిమాలకు దక్కినా కానీ వెంటనే సమ్మర్ రేసు లో నిలిచిన సినిమాలు అన్నీ కరోనా ఎఫెక్ట్ తో వరుసగా పోస్ట్ పోన్ ల మంత్రం పాటించడం తో ఈ ఇయర్ సమ్మర్ మొత్తం కరోనా లాక్ డౌన్ మయం అయిపొయింది. ఇక సెకెండ్ ఆఫ్ లో కొంత భాగం కూడా థియేటర్స్…
మూసే ఉండే అవకాశం లేదా, చాలా తక్కువ ఆక్యుపెన్సీ తో రన్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి టైం లో ఈ ఇయర్ పెద్ద హీరోల నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అని ఇండస్ట్రీ పెద్దలు తేల్చేస్తున్నారు. అందునా షూటింగ్ సగానికి అటూ ఇటూ గా పూర్తీ అయిన సినిమాలు…
అన్నీ ఇప్పుడు వచ్చే ఇయర్ నే టార్గెట్ చేస్తున్నాయి. అందులో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ ఆచార్య కూడా ఉండబోతుందని సమాచారం.. కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఈ ఇయర్ ఆగస్టు లో రిలీజ్ అనుకున్నా…
అది పోస్ట్ పోన్ అవుతూ దసరా రేసు లో చేరింది కానీ అప్పటికి సినిమా షూటింగ్ పూర్తీ అయ్యే అవకాశం తక్కువే అవ్వడం తో ఇయర్ ఎండ్ లో రిలీజ్ అనుకున్నా అది కూడా వద్దని మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన సంక్రాంతి రేసు లో మళ్ళీ చిరు నిలిచే అవకాశం ఉందని సమాచారం. ఈ ఇయర్ సంక్రాంతి మూవీస్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోయడం తో…
వచ్చే ఇయర్ సంక్రాంతి కి ఆర్ ఆర్ ఆర్ అనుకున్న పోస్ట్ పోన్ అవ్వడం తో అందరికన్నా ముందు సంక్రాంతి ని ఆక్యుపై చేయడానికి సిద్ధం అయ్యాడు మెగాస్టార్. మంచి క్రేజ్ నడుమ వస్తున్న ఆచార్య అనుకున్నట్లే సంక్రాంతి కి వస్తే కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.