Home న్యూస్ మేమ్ ఫేమస్ రివ్యూ-రేటింగ్!

మేమ్ ఫేమస్ రివ్యూ-రేటింగ్!

0

రీసెంట్ టైంలో చిన్న సినిమానే అయినా కూడా ఎక్స్ లెంట్ ప్రమోషన్స్ తో మంచి బజ్ ని సొంతం చేసుకున్న సినిమా మేమ్ ఫేమస్… ప్రమోషన్స్ కొంచం ఓవర్ ది టాప్ అనిపించేలా ఉన్నప్పటికీ కూడా ఒక సినిమాకి కావాల్సిన బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…

ఊర్లో అల్లరి చిల్లరగా తిరిగే 3 ఫ్రెండ్స్, అందరితో చివాట్లు తింటూ ఉండగా ఎలాగైనా ఫేమస్ అవ్వాలని ఏం చేశారు అన్నది సినిమా స్టోరీ పాయింట్…. చాలా చాలా సింపుల్ స్టొరీ పాయింట్ తో వచ్చిన ఈ సినిమా పార్టు పార్టులుగా పర్వాలేదు అనిపించింది కానీ ఓవరాల్ గా సినిమా పరంగా మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది…

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంత మంచి ప్రమోషన్స్ ని సొంతం చేసుకున్న సినిమా క్వాలిటీ పరంగా షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ సినిమాకి తక్కువ అన్నట్లు తెరకెక్కించారు… ఇక కొన్ని సీన్స్ కి సౌండ్ మిక్సింగ్ కూడా సెట్ అవ్వలేదు, కొన్ని సీన్స్ సౌండ్ సరిగ్గా సింక్ కూడా అవ్వలేదు… ఇక సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ ఫుల్లు అంటూ చెప్పారు కానీ అవి కొన్ని సీన్స్ కే పరిమితం అయ్యాయి….

సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచం టైం పట్టగా 3 ఫ్రెండ్స్ ఇక మేమ్ ఫేమస్ అవ్వాలి అనుకున్నప్పటి నుండి సినిమా పర్వాలేదు అనిపిస్తూ సాగగా సెకండ్ ఆఫ్ లో ఓవర్ మెలో డ్రామా, స్లో స్క్రీన్ ప్లే వలన లెంత్ మరీ ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే విలేజ్ లో ఉండే నాచురల్ సీన్స్ ను బాగానే చూపించగా…

అందరు యాక్టర్స్ కూడా బాగా నటించి మెప్పించాడు, డైరెక్టర్ కం హీరో అయిన సుమంత్ ప్రభాస్ బాగానే నటించగా మిగిలిన నటీనటులు అందరూ ఆకట్టుకున్నారు, కొన్ని సీన్స్ లో కామెడీ కూడా బాగుంది అనిపించేలా ఉండగా, కథను కూడా బాగానే రాసుకున్నాడు అని చెప్పాలి, ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా బాగానే ఇంప్రెస్ చేస్తుంది….2 పాటలు కూడా మెప్పించగా బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది.. ఎడిటింగ్ స్క్రీన్ ప్లే జస్ట్ ఓకే అనిపిస్తాయి.

ఎటొచ్చి కథ చాలా సింపుల్ గా ఉండటం, సెకెండ్ ఆఫ్ లాగ్ ఉండటం, ఎండింగ్ జస్ట్ ఓకే అనిపించేలా ఉండటంతో ఓవరాల్ గా పార్టు పార్టులుగా టైం పాస్ అయ్యేలా ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీని చూడాలి అంటే ఓపిక చాలా అవసరం అని చెప్పాలి. లెంత్ తగ్గించి 2 గంటల నిడివితో సినిమాను రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది….

ఓవరాల్ గా ఇది యూత్ ఓరియెంటెడ్ మూవీ అవ్వడంతో వాళ్ళ పాయింట్ ఆఫ్ ఫ్యూలో చెప్పాలి అంటే, వాళ్ళు ఎంజాయ్ చేసే సీన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఆలోచింపజేసే సీన్స్ ఉన్నాయి, నవ్వించే సీన్స్ కొన్ని ఉన్నాయి, ఓవరాల్ గా యూత్ కి కొంచం బోర్ ఫీల్ అయినా ఒకసారి చూసేలా అనిపిస్తుంది.

కానీ రెగ్యులర్ మూవీస్ చూసే ఆడియన్స్ సినిమా హైప్ ను చూసి వెళితే మట్టుకు కొన్ని సీన్స్ మినహా ఓవరాల్ గా మూవీ హైప్ కి తగ్గట్లు లేదనిపిస్తుంది… సో అంచనాలు చాలా చాలా నార్మల్ గా పెట్టుకుని వెళితే కొంచం బోర్ ఫీల్ అయినా సినిమా టైం పాస్ ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది.. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here