విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా అడుగు పెట్టిన మొదటి సినిమా దొరసాని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా రెండో సినిమా గా మొదలు పెట్టిన మిడిల్ క్లాస్ మీలోడీస్ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా సినిమా ఈ నెల 20 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది, కాగా సినిమా బడ్జెట్ మొత్తం మీద 3 కోట్ల రేంజ్ లో ఉండగా…
సినిమాను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 4.5 కోట్ల రేటు చెల్లించి డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నారు, ఇక సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుందని చెప్పొచ్చు. తండ్రి కొడుకులు హోటల్ బిజినెస్ చేస్తుండగా…
కొడుకు పెట్టె బొంబై చట్నీ ఫేమస్ అవ్వడంతో తను కూడా సెపరేట్ హోటల్ పెట్టాలని డిసైడ్ అయిన హీరో గుంటూరు వెళ్లి అక్కడ సెపరేట్ హోటల్ పెట్టడానికి పడే కష్టం, పెట్టిన తర్వాత ఎదురైన పరిస్థితులు లాంటివి ట్రైలర్ లో ఎంటర్ టైన్ మెంట్ వే లో ఆకట్టుకునేలా చూపెట్టారు.
హీరో ఫాదర్ రోల్ ఆవేశంతో మాట్లాడే మాటలు కామెడీగా ఉండగా హీరోయిన్ క్యూట్ లుక్స్ తో మెప్పించింది, కొంచం ఫ్రెష్ ట్రీట్ మెంట్ తో ట్రైలర్ చాలా వరకు మెప్పించింది అని చెప్పాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ప్లజెంట్ గా అనిపించింది. మొత్తం మీద ట్రైలర్ ఆకట్టుకోగా ఇప్పుడు సినిమా పై మినిమమ్ అంచనాలు పెరిగేలా చేసింది ఈ ట్రైలర్.
మొదటి సినిమా ప్రయోగాత్మకంగా ప్లాన్ చేసినా బెడసి కొట్టడం తో ఇప్పుడు రెండో సినిమా విషయం లో సింపుల్ కథతో ఎంటర్ టైన్ మెంట్ తో రాబోతున్న ఆనంద్ దేవరకొండ ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి మరి, ఈ నెల 20 న డైరెక్ట్ రిలీజ్ కాబోతున్న మిడిల్ క్లాస్ మెలొడీస్ ట్రైలర్ వరకు ఆకట్టుకుని సినిమా పై కొంచం ఎక్స్ పెర్టేషన్స్ అయితే పెంచగలిగింది అని చెప్పొచ్చు.