Home న్యూస్ మంచి ఛాన్స్ మిస్….మళ్ళీ వేట మొదలు!!

మంచి ఛాన్స్ మిస్….మళ్ళీ వేట మొదలు!!

0

నందమూరి కళ్యాణ్ రామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ బింబిసార సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నాడు, ఆ సినిమా తన మార్కెట్ రేంజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. వేరే ఏ యాక్టర్ అయినా ఈ విజయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మంచి కమర్షియల్ మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర తర్వాత సినిమాలతో దుమ్ము లేపాలని భావిస్తాడు కానీ కళ్యాణ్ రామ్ ఎక్స్ పెరి మెంటల్ మూవీనే చేశాడు…

అప్పటికే ఒప్పుకున్న అమిగోస్ అనే ఎక్స్ పెరి మెంటల్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ కి ఆడియన్స్ నుండి అనుకున్న రేంజ్ లో అయితే రెస్పాన్స్ ఏమాత్రం రాలేదు అనే చెప్పాలి. సినిమా హిట్ ఫ్లాఫ్ ఎవరికీ చేతిలో ఉండదు కానీ…

బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చే సినిమాకి ఉండాల్సిన హైప్ ను కూడా అమిగోస్ సొంతం చేసుకోలేక పోయింది. దాంతో అమిగోస్ ఓపెనింగ్స్ అసలు బింబిసార దరిదాపుల్లో కూడా లేక పోవడం విచారకరం అని చెప్పాలి ఇప్పుడు….

మొత్తం మీద బింబిసార తర్వాత తన మార్కెట్ ను మరింతగా పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు అమిగోస్ సినిమాతో ఆ అవకాశాన్ని కళ్యాణ్ రామ్ మిస్ చేసుకున్నాడు… దాంతో మళ్ళీ ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమా తో భారీ కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here