బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ టైంలో వరుస విజయాలతో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దుమ్ము లేపిన బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) కోవిడ్ తర్వాత ఒక్క సూర్యవంశీ సినిమా తప్పితే మిగిలిన సినిమాలు అన్నింటితో వరుస ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరచగా ఎట్టకేలకు ఈ ఇయర్ OMG2 సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర..
ఓ మంచి హిట్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ లో వరల్డ్ వైడ్ గా ఆ సినిమా 221 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది, ఆ సినిమా తర్వాత అక్షయ్ కుమార్ నుండి వచ్చిన కొత్త సినిమా మిషన్ రాణిగంజ్(Mission Raniganj) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ట్రైలర్ బాగున్నా ఏమాత్రం బజ్ ను సొంతం చేసుకోలేక పోయింది.
ఇక సినిమా హిట్ టాక్ ఆడియన్స్ నుండి వచ్చినా కూడా జనాలు థియేటర్స్ కి రావడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. దాంతో సినిమా హిట్ టాక్ తో కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేక పోయింది….. 5 రోజుల్లో 15.30 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిన ఈ సినిమా…
మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా మరో 15 కోట్లు కలెక్ట్ చేసి టోటల్ రన్ లో 30.3 కోట్ల నెట్ కలెక్షన్స్ ని మాత్రమే అందుకోగా వరల్డ్ వైడ్ గా 41 కోట్ల గ్రాస్ ను మాత్రమే అందుకుని డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని అత్యంత దారుణంగా నిరాశ పరిచింది ఇప్పుడు. సినిమాకి టాక్ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ కూడా…
కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా దారుణంగా విఫలం అవ్వడం బాలీవుడ్ మొత్తానికి మైండ్ బ్లాంక్ చేసింది ఇప్పుడు. వరుస ఫ్లాఫ్స్ కి OMG2 తో బ్రేక్ వేసిన అక్షయ్ కుమార్ ఈ సినిమాతో తిరిగి మళ్ళీ ఫ్లాఫ్స్ లోకి ఎంటర్ అయ్యాడు. మరి తన అప్ కమింగ్ మూవీస్ తో ఓ స్ట్రాంగ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.