బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man) మూవీ మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు కానీ సినిమా ఆ ఆశలు అంచనాలను అయితే అందుకోలేక పోయింది. భారీగా రిలీజ్ ను సొంతం చేసుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా….
ఏమాత్రం టాక్ పాజిటివ్ గా సొంతం చేసుకోక పోవడంతో కలెక్షన్స్ పరంగా మినిమం ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచి నితిన్ ఖాతాలో మరో ఫ్లాఫ్ మూవీ గా మారింది. మేకర్స్ అండ్ హీరో సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండటంతో…
బయర్స్ కూడా సినిమా కోసం భారీ రేట్లను పెట్టి కొన్నారు… ఆల్ మోస్ట్ 25 కోట్ల వరకు వాల్యూ బిజినెస్ ను అందుకున్న సినిమా లో ఓన్ రిలీజ్ పక్కకు పెట్టినా 20 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. కానీ సినిమా టోటల్ గా బయర్స్ కి ఆల్ మోస్ట్ 75% రేంజ్ లో లాసులు తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…
అందరూ నష్టపరిహారం కోసం ఎదురు చూస్తూ ఉండగా పెద్ద మనసు చేసుకున్న హీరో నితిన్ సినిమా ద్వారా నష్టపోయిన వాళ్ళకి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా అంటూ ఒప్పుకున్నాడట. అది ఎంతవరకు అన్నది డీటైల్స్ తెలియాల్సి ఉండగా ఓవరాల్ గా నితిన్ తీసుకున్న నిర్ణయంతో అందరూ నితిన్ ను మెచ్చుకుంటున్నారు. ఇక నితిన్ ఈ ఇయర్ లో రాబిన్ హుడ్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా ఆ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ను దక్కించుకుంటాడో చూడాలి.