అఖిల్ అక్కినేని నిది అగర్వాల్ ల కాంబినేషన్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ మిస్టర్ మజ్ను బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే పర్వాలేదు అనిపించుకునే టాక్ ని సొంతం చేసుకుంది, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ విషయానికి వస్తే ఆన్ లైన్ బుకింగ్స్ స్లో గా ఓపెన్ అవ్వడం కొద్దిగా సినిమా కి ఎఫెక్ట్ చూపింది అని చెప్పాలి.
అయినా కానీ సినిమా మొదటి షో సమయానికి టోటల్ గా 20% వరకు ఆక్యుపెన్సీ తో ఓపెన్ అవ్వగా మ్యాట్నీ షో ల నుండి కొద్ది కొద్దిగా పుంజు కుంటున్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ స్టేటస్ పర్వాలేదు అనిపించే విధంగా ఉందని చెప్పాలి.
కానీ ఓవరాల్ గా అఖిల్ మొదటి రెండు సినిమాలతో పోల్చితే కొద్దిగా తక్కువగానే ఉంది, అది కొంచం షాక్ ఇస్తున్నా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి అన్ని ఏరియాల్లో సినిమా బాగానే పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.
దాంతో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అనుకున్న రేంజ్ లో ఉంటే మొదటి రోజు సినిమా కలెక్షన్స్ రెండు రాష్ట్రాలలో 2.2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ కి చేరే అవకాశం ఉందని చెప్పాలి, అదే సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే కనుక సినిమా..
కచ్చితంగా తొలిరోజు 2.5 కోట్ల రేంజ్ కి పెరిగే అవకాశం ఉంది, ఇక సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ షోల తో ఫైనల్ గా 62 వేల డాలర్స్ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంది, ఇక రెండు రాష్ట్రాల నైట్ షోల సమయానికి స్టేటస్ ఎలా ఉందో చూసి అప్ డేట్ చేస్తాం.