అక్షరాలా 64 కోట్లు+…ఆల్ టైం టాప్ 2…. భీభత్సం ఇది

0
600

     చాలా కాలంగా ఓ అద్బుతమైన విజయం కోసం ఎదురు చూస్తున్న విక్టరీ వెంకటేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన విశ్వరూపం చూపుతూ దూసుకు పోతున్నాడు, పక్కన వరుణ్ తేజ్ కూడా ఉన్నా కానీ లేటెస్ట్ మూవీ F2 లో వెంకీ దే ఎక్కువ డామినేషన్ అన్న విషయం అందరికీ తెలిసిందే, సంక్రాంతి బరి లో లేట్ గా ఎంటర్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సెలవుల్లో ఓ రేంజ్ లో కలెక్షన్స్ మ్రోత మ్రోగించగా సెలవుల తర్వాత కూడా ఫుల్ జోరు చూపుతుంది.

సినిమా ఇప్పటికే 60 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ ని క్రియేట్ చేయగా రీసెంట్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, సినిమా ఇప్పుడు 64 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సంక్రాంతి సీజన్ లో సంచలనం సృష్టించింది.

సంక్రాంతి సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో వసూళ్ళ భీభత్సం సృష్టించిన సినిమా కేవలం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 అనే చెప్పాలి. ఓ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఆ సినిమా టోటల్ రన్ లో ఏకంగా 104 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా…

సంక్రాంతి సీజన్ ఆల్ టైం నంబర్ 1 గా నిలిచిన విషయం తెలిసిందే, ఇక ఇప్పుడు రెండో ప్లేస్ లో రీసెంట్ గౌతమీపుత్ర శాతకర్ణి ని దాటేసిన వినయ విధేయ రామ సినిమా ని కూడా దాటేసి F2 సినిమా సెన్సేషన్ ని క్రియేట్ చేసి ఆల్ టైం సంక్రాంతి మూవీస్ లో…

రెండో ప్లేస్ ని దక్కించుకుని దుమ్ము లేపింది, సినిమా ఇప్పటికీ జోరు తగ్గకుండా కలెక్షన్స్ తో దుమ్ము లేపు తుండటం తో లాంగ్ రన్ లో మరో 10 నుండి 15 కోట్ల షేర్ ని అందుకున్నా ఆశ్యర్య పోనవసరం లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి సినిమా ఆ మార్క్ ని అందుకుంటుందా??? న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here