Home న్యూస్ మిస్టర్ మజ్ఞు రివ్యూ-హిట్టా ఫట్టా!

మిస్టర్ మజ్ఞు రివ్యూ-హిట్టా ఫట్టా!

0
Mr Majnu Movie Review Rating
Mr Majnu Movie Review Rating

      అక్కినేని అఖిల్ తొలి సినిమా అఖిల్ రెండో సినిమా హలో తో ప్రేక్షకుల మెప్పు పొందినా బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన హిట్ ని అందుకోలేదు. ఇలాంటి సమయం లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ కాకుండా ప్రేక్షకుల ముందుకు మరోసారి లవ్ స్టొరీ తో వచ్చాడు, ఆ సినిమా నే మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసు కుందాం పదండీ..

చూసిన ప్రతీ అమ్మాయిని తన వలలో పడేలా చేసుకునే హీరో ప్రేమ అంటే వాళ్ళని దూరం పెడతాడు, అలాంటి హీరో కి లాంగ్ లైఫ్ తనని ప్రేమించే అబ్బాయి కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ తో పరిచయం అవుతుంది, తర్వాత వీరి లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అన్నది స్టొరీ పాయింట్.

ఇలాంటి స్టొరీ పాయింట్ తోనే ఆరెంజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే, కానీ ఇక్కడ ట్రీట్ మెంట్ డిఫెరెంట్ గా ఉంటుంది, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ వర్కౌట్ అయినా కానీ నిది అగర్వాల్ నటన పరంగా పెద్దగా మార్కులు అయితే సాధించలేక పోయింది.

అఖిల్ మాత్రం మంచి ఈజ్ తో నటించి మెప్పించాడు, కానీ నటన మరింత మెరుగు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి, ఇక డాన్స్ పంగా యాక్షన్ సీన్స్ లో తన మార్క్ ని చూపెట్టి ప్రేక్షకులను మెప్పించాడు అఖిల్.

ఇక మిగిలిన పాత్రలు తమ పాత్ర మేరకు నటించి మెప్పించాయి, ఇక సంగీతం విషయానికి వస్తే తమన్ సోల్ ఫుల్ మ్యూజిక్ తో సినిమా థీం కి తగ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు, పాటలు అన్ని వినడానికి వెండితెరపై చూడటానికి చాలా బాగున్నాయి.

ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది, ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ బోర్ కొట్టే సీన్స్ కొన్ని ఎడిట్ చేసి ఎమోషనల్ సన్నివేశాల లెంత్ తగ్గించి ఉంటె బాగుండేది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమా లోకేషన్స్ చాలా బాగున్నాయి.

ఇక డైరెక్షన్ పరంగా వెంకీ అట్లూరి ఇది వరకు తీసిన తొలిప్రేమ సినిమా లో ఫస్టాఫ్ పూర్తీ ఎంటర్ టైన్ మెంట్ వే లో వెళ్లి ఒక చిన్న పాయింట్ తో లీడ్ పెయిర్ విడిపోవడం తిరిగి సెకెండ్ ఆఫ్ లో ఎలా కలిసారు అన్న పాయింట్ ని చెప్పినట్లే ఇక్కడ కూడా ఇంటర్వెల్ వరకు…

కుమ్మేసినా విడిపోయే పాయింట్ సెకెండ్ ఆఫ్ చాలా సన్నివేశాలు ఎమోషనల్ వే లో సాగడం అన్నది కొద్దిగా బోర్ కొట్టింది అని చెప్పాలి, మళ్ళీ క్లైమాక్స్ వచ్చే సరికి అది సెట్ అయినా కానీ సెకెండ్ ఆఫ్ మొదటి 40 నిమిషాల పై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

ఓవరాల్ గా సినిమా ఆల్ మోస్ట్ తొలిప్రేమ రూట్ లోనే వెళ్ళినా కమర్షియల్ హంగులు మరింతగా ఉండటం కలిసి వచ్చింది, కానీ సెకెండ్ ఆఫ్ సీన్స్ వలన ఫస్టాఫ్ ఇచ్చిన ఇంప్రెషన్ సెకెండ్ ఆఫ్ వలన కొద్దిగా మిస్ అయింది అని చెప్పాలి, ఫైనల్ గా సినిమా…

ఎబో యావరేజ్ గా అనిపించింది, రొమాంటిక్ లవ్ స్టొరీ లు ఇష్టపడే వారు సినిమాను ఒకసారి చూడొచ్చు, ఫ్యాన్స్ కి కూడా బాగానే నచ్చుతుంది, ఫ్యామిలీ అండ్ కామన్ ఆడియన్స్ సెకెండ్ ఆఫ్ ని కొంచం బరిస్తే సినిమా పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది

సినిమాకి ఫైనల్ రేటింగ్ 2.75-5 స్టార్స్… మీరు సినిమా చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూడండి.. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here