బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి భారీగా రిలీజ్ అయిన మూవీస్ లో కింగ్ నాగార్జున(King Nagarjuna) నటించిన నా సామి రంగ(Naa Saami Ranga) మూవీ కూడా ఒక్కటి, పక్కా పల్లెటూరి నేపధ్యంలో సంక్రాంతి పండగకి పెర్ఫెక్ట్ మూవీలా అనిపించడంతో ఆడియన్స్ నుండి రెస్పాన్స్ సొంతం చేసుకుంది…
పండగ టైంలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న సినిమా తర్వాత స్లో డౌన్ అయినా కూడా ఉన్నంతలో బ్రేక్ ఈవెన్ ని అయితే కంప్లీట్ చేసుకుంది. ఇక సినిమా రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఇక్కడ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ ఇప్పుడు సొంతం అవుతుంది అన్నది…
ఆసక్తిగా మారగా డిజిటల్ రిలీజ్ తర్వాత సినిమా కి రెస్పాన్స్ మాత్రం మిక్సుడ్ గా ఉందని చెప్పొచ్చు. సినిమాలో నాగార్జున మాస్ ఎలివేషన్స్, హీరోయిన్ ఆశికా ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్రజెన్స్, అల్లరినరేష్ రోల్ అలాగే విలన్ రోల్స్ బాగుండటం ఓవరాల్ గా మేజర్ ప్లస్ అయితే సినిమా కథ ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉండటం…
తర్వాత కథ ఏమవుతుంది అన్నది కూడా చాలా ఈజీగా గెస్ చేసేలా ఉండటంతో రొటీన్ మూవీలానే అనిపించింది అంటూ టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద రొటీన్ గానే ఉన్నా కూడా నాగార్జున కోసం ఈజీగా ఒకసారి చూడొచ్చు అంటూ చెబుతూ ఉన్నా సినిమా మాత్రం రొటీన్ మూవీనే అంటున్నారు. పండగ టైంలో ఈ సినిమా…
పెర్ఫెక్ట్ మూవీలా అనిపించినా మరీ అనుకున్న రేంజ్ లో హిట్ అయితే కాలేదు…. ఉన్నంతలో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న సినిమా డీసెంట్ కంబ్యాక్ మూవీగా నిలిచింది. ఇక ఇప్పుడు డిజిటల్ లో కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా టెలివిజన్ లో కూడా త్వరలో టెలికాస్ట్ కానుంది కాబట్టి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.