Home న్యూస్ 24 గంటలు ఓవర్…లవ్ స్టొరీ టీసర్ రికార్డు కొట్టింది!

24 గంటలు ఓవర్…లవ్ స్టొరీ టీసర్ రికార్డు కొట్టింది!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర త్వరలోనే రంగం లోకి దిగడానికి సిద్ధం అవుతుండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. కాగా టీసర్ కి వస్తున్న రెస్పాన్స్ అద్బుతంగా ఉందని చెప్పాలి. డాన్స్ మాస్టర్ గా స్ట్రగుల్ అవుతున్న హీరో కి ఒక సాఫ్ట్ వేర్ జాబ్ కోసం..

ట్రై చేస్తున్న హీరోయిన్ కి మధ్య హార్ట్ టచింగ్ లవ్ స్టొరీ గా తెరకెక్కిన లవ్ స్టొరీ మూవీ టీసర్ పరంగా అంచనాలను బాగానే అందుకుని సినిమా పై ఉన్న క్రేజ్ ని మరింత పెరిగేలా చేయగా టీసర్ కి మొదటి 24 గంటల్లో యూట్యూబ్ లో సంచలన వ్యూస్ అండ్ లైక్స్ దక్కాయి.

టైర్ 2 హీరోలలో ఫాస్టెస్ట్ 2 లక్షల లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా రికార్డ్ కొట్టిన ఈ టీసర్ మొత్తం మీద మొదటి 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 4.92 మిలియన్ వ్యూస్ ని 2 లక్షల 65 వేల దాకా లైక్స్ ని సొంతం చేసుకుని టైర్ 2 హీరోలలో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ని సొంతం చేసుకున్న…

టీసర్ లలో టాప్ 2 ప్లేస్ ని దక్కించుకుని రికార్డ్ కొట్టింది. ఒకసారి టైర్ 2 హీరోలలో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్లను గమనిస్తే…
WorldFamousLover(2020): 6.36Mil
#LoveStory – 4.92
Majili(2019)- 4.1 M
V Teaser(2020): 3.85 Mil
GangLeader(2019): 3.8M
ఇవి మొత్తం మీద టాప్ 5 లో నిలిచిన టీసర్ లు. ఇక ఇప్పటి వరకు రిలీజ్ అయిన టైర్ 2 హీరోల సినిమాల టీసర్ లలో హైయెస్ట్ లైక్స్ ని 24 గంటల్లో సొంతం చేసుకున్న టీసర్ లను ఒకసారి గమనిస్తే…

WorldFamousLover(2020): 268K
#LoveStory – 265.7K
V Teaser(2020): 181K likes
Majili(2019)- 145K
#REDTheFilm(2020) – 142K
ఇవీ మొత్తం మీద టాప్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ లు… మొత్తం మీద లవ్ స్టొరీ టీసర్ 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి సాలిడ్ వ్యూస్ అండ్ లైక్స్ తో సినిమా పై ఉన్న క్రేజ్ ని నిరూపించుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here