Home న్యూస్ లవ్ స్టొరీ టోటల్ బిజినెస్….ఈ టైం లో బిగ్గెస్ట్ రికార్డ్!

లవ్ స్టొరీ టోటల్ బిజినెస్….ఈ టైం లో బిగ్గెస్ట్ రికార్డ్!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా కి యూత్ లో సాలిడ్ క్రేజ్ ఉన్న నేపధ్యంలో థియేటర్స్ లోకి బరిలోకి దిగబోతున్న ఈ సినిమా ఎంత క్రేజ్ ఉన్నా కానీ ప్రస్తుత పరిస్థితులు సినిమా కి పెద్దగా అనుకూలంగా లేకున్నా కానీ సినిమా బిజినెస్….

సెన్సేషన్ అనిపించే రేంజ్ లో సొంతం చేసుకుని ఊచకోత కోసింది. సెకెండ్ వేవ్ తర్వాత సినిమాలను కొనడానికే అందరూ బయపడుతూ ఉంటే ఈ సినిమా విషయంలో మాత్రం బయ్యర్లు ఊహకందని ఆసక్తిని చూపెడుతూ సినిమా పై ఫుల్ నమ్మకంగా ఉండటంతో సినిమా మీద అంచనాలను మించే రేంజ్ లో…

బిజినెస్ ఆఫర్స్ కోట్ చేశారు… రీసెంట్ గా సినిమా బిజినెస్ సేఫ్ సైడ్ లో తగ్గిస్తున్నారు అనే వార్తలు వచ్చినా కానీ ఇప్పుడు ఓవరాల్ గా బిజినెస్ లెక్క ఏకంగా 30 కోట్ల మార్క్ ని అధిగమించి నాగ చైతన్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది.

ఒకసారి ఏరియాల వారిగా సినిమా సాధించిన బిజినెస్ ను గమనిస్తే…
Nizam: 10Cr
Ceded: 3.15Cr
UA: 3.25Cr
Guntur: 2.5Cr
East: 2.4Cr
West: 2Cr
Krishna: 1.8Cr
Nellore: 1.2Cr
AP-TG Total: 26.3Cr
Ka+ROI: 2.10Cr
OS – 2.8Cr
Worldwide: 31.2Cr
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క….

సెకెండ్ వేవ్ తర్వాత ఈ రేంజ్ లో ఊచకోత కోసిన లవ్ స్టొరీ సినిమా నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ బిజినెస్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే 32 కోట్ల మేర షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సినిమా బాక్స్ అఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here