రిలీజ్ అయినప్పుడు కాకుండా బాక్స్ ఆఫీస్ రన్ అయి పోయిన తర్వాత వార్తల్లో నిలిచిన సినిమా బ్రీత్(BREATHE Movie) నందమూరి చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) నటించిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ టైంలో రిలీజ్ అయ్యి పెద్దగా అంచనాలను అందుకోలేక పోయిన సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది…
కాగా ఆ సినిమా రిలీజ్ టైంలో కాకుండా తర్వాత ఎక్కువగా ట్రోల్స్ కి గురి అయింది, OTT రిలీజ్ తర్వాత ఇంకా ఎక్కువగా ట్రోల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా గురించి లేటెస్ట్ గా నందమూరి చైతన్య కృష్ణ కామెంట్స్ చేశాడు, అది ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ కాంట్రవర్సీకి కారణం అయ్యాయి అని చెప్పాలి ఇప్పుడు….
తన సినిమా రిలీజ్ టైంలో నన్ను నా సినిమాను భారీగా ట్రోల్ చేశారని, ఇదంతా ఆంధ్రప్రదేశ్ YSRCP పార్టీ కొడాలి నాని మరియు వల్లభనేని వంశీలు అలాగే జూనియర్ ఫ్యాన్స్ కావాలని చేశారని, మీరు మాకు ఎలాంటి సపోర్ట్ చేయలేదని, నేను ఉండగా చంద్రబాబు నాయుడిని కానీ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)ని కానీ టచ్ చేయలేరని…
వార్కింగ్ ఇచ్చారు…అలాగే జూనియర్ ఫ్యాన్స్ కూడా నన్ను నా సినిమాను ట్రోల్ చేశారని జాగ్రత్తగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారగా జూనియర్ ఫ్యాన్స్ అంటే అందరూ జూనియర్ ఎన్టీఆర్(JR NTR) ఫ్యాన్స్ నే నందమూరి చైతన్య కృష్ణ అంటున్నాడని అనుకుంటున్నారు…
దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో మరింతా నందమూరి చైతన్య కృష్ణ పై ట్రోల్స్ పడుతూ ఉండగా ఈ టైంలో ఇలాంటి కామెంట్స్ అది కూడా ఎన్టీఆర్ బర్త్ డే తర్వాత ఇలాంటి కామెంట్స్ చేయడం వలన పొలిటికల్ గా ఇంకా ఎదో జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇక నందమూరి చైతన్య కృష్ణ తర్వాత సినిమా సోషల్ మీడియాలో మరింత హడావుడి చేయడం ఖాయమని చెప్పొచ్చు.
🤣🤣🤣