Home న్యూస్ NANI31 – సరిపోదా శనివారం గ్లిమ్స్ రివ్యూ…ఇదేం మాస్ రా బాబు!

NANI31 – సరిపోదా శనివారం గ్లిమ్స్ రివ్యూ…ఇదేం మాస్ రా బాబు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సమ్మర్ లో దసరా(Dasara) మూవీతో ఊరమాస్ హిట్ ను సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) ఇప్పుడు హై నాన్న(Hi Nanna) మూవీతో ఈ ఇయర్ ఎండ్ లో రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా తర్వాత నాని తిరిగి తనతో అంటే సుందరానికీ(Ante Sundaraniki) సినిమా తీసిన డైరెక్టర్….

వివేక్ ఆత్రేయ(Vivek Athreya) డైరెక్షన్ లో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు… సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram) అంటూ డిఫెరెంట్ టైటిల్ ని అనౌన్స్ చేయగా టైటిల్ పేరు చూసిన తర్వాత ఈ సినిమాను అందరూ అంటే సుందరానికీ రేంజ్ లో మరో క్లాస్ మూవీ గా అందరూ అనుకున్నారు, కానీ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ సినిమా…

గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా గ్లిమ్స్ చూసిన తర్వాత అందరి అంచనాలు తలకిందలు అయ్యి ఓ రేంజ్ లో మాస్ ఊచకోత కోసేలా మాస్ ఎలిమెంట్స్ తో దసరా రేంజ్ ని తలపించేలా ఊరమాస్ కట్ తో మెప్పించింది… ప్రతీ ఒక్కరికీ ఎదో ఒక రోజు కలిసి వస్తుందని, అలాంటి ప్రతీ శనివారం ఒకడికి కలిసి వస్తే ఎలా ఉంటుంది…

అన్న కాన్సెప్ట్ తో వస్తున్న సరిపోదా శనివారం సినిమా లో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ నటిస్తుండగా మరో కీలక రోల్ లో ఎస్ జే సూర్య నటిస్తున్నాడు, భారీ స్టార్ కాస్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సరిపోదా శనివారం సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

సినిమా మీద ఉన్న అంచనాలు గ్లిమ్స్ తో ఒక్కసారిగా పెరిగి పోగా గ్లిమ్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓ రేంజ్ లో మెప్పించింది, ఓవరాల్ గా గ్లిమ్స్ సినిమా మీద ఉన్న అంచనాలను పెంచేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇదే రేంజ్ లో మెప్పిస్తే నాని ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ సొంతం అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here