టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో ప్రస్తుతం ఫుల్ కన్సిస్టంట్ గా డిఫెరెంట్ మూవీస్ ని ట్రై చేస్తూ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ లను దక్కించుకుంటూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) ఇప్పుడు హిట్3 మూవీ తో ఈ సమ్మర్ లో సందడి చేయబోతూ ఉండగా…ఈ సినిమా టీసర్ లో నాని ని చూసి అందరూ…
షాకయ్యే రేంజ్ సీన్స్ తో ఆశ్యర్యపరిచిన తర్వాత ఇప్పుడు దసరా సినిమా తీసిన శ్రీకాంత్ ఓడెల డైరెక్షన్ లో తన కొత్త సినిమాను మొదలు పెట్టగా…సినిమాకి ది ప్యారడైజ్ అనే టైటిల్ ను కన్ఫాం చేయగా…సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను ఇప్పుడు రిలీజ్ చేశారు…
ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత అసలు ఇలాంటి రా రస్టిక్ థాట్స్ తో నాచురల్ స్టార్ నుండి ఇలాంటి డిఫెరెంట్ జానర్ మూవీస్ ని ఎవరూ ఎక్స్ పెర్ట్ చేయని రేంజ్ లో షాకులు ఇస్తూ ఉండటం విశేషం…ఈ సారి మరింత రా గా ఈ కథని చెప్పబోతున్నట్లు గ్లిమ్స్ లోనే చూపించారు…
ఇప్పటి వరకు పక్షుల గురించి ఎంతో మంది చెప్పినా కాకుల గురించి ఎవ్వరూ చెప్పలేదు అంటూ మొదలైన ఈ గ్లిమ్స్ లో నాని కంప్లీట్ గా డిఫెరెంట్ అవతార్ లో కనిపించబోతున్నట్లు చూపించగా…బహుశా స్టార్ డం ఉన్న హీరోలలో ఎవ్వరూ చేయని సాహసం నాని ఇందులో చేయబోతున్నాడు…
స్టార్ డం ఉన్న హీరోల సినిమాల్లో బూతులు మాట్లాడటం కూడా చాలా అరుదుగా చేస్తూ ఉంటారు, కానీ ఈ సినిమాలో నాని తన చేతి పైనే బూతుని పచ్చబొట్టుగా పెట్టడం…ఆ డైలాగ్ ను హైలెట్ చేస్తూ సీన్ ని రాసుకోవడం అందరికీ షాకిచ్చింది అని చెప్పాలి..
సినిమా కూడా కంప్లీట్ గా రా కంటెంట్ తో ఉండబోతుందని ఆల్ రెడీ శ్రీకాంత్ ఓడెల నాని పలు మార్లు చెప్పినా ఈ రేంజ్ లో రా ఉంటుంది అని అయితే ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు అనే చెప్పాలి. ఇక సినిమా వచ్చే ఏడాది మార్చ్ 26న రిలీజ్ కానుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాక్ టు బాక్ కంప్లీట్ డిఫెరెంట్ జానర్స్ తో వస్తున్న నానికి ఎలాంటి రిజల్ట్ సొంతం అవుతుందో చూడాలి ఇప్పుడు.