బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో మంచి ఫాం లో ఉన్న సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు, మల్టీ స్టారర్ మూవీస్ ఎక్కువగా సక్సెస్ అయినా కానీ వాటి సక్సెస్ క్రెడిట్ ఎక్కువ శాతం వెంకీ కే వెళ్ళింది అనడం లో ఎలాంటి డౌట్ లేదు, ఎఫ్ 2 కావొచ్చు వెంకిమామ కావొచ్చు ఆ రెండు సినిమాల సక్సెస్ క్రెడిట్ ఎక్కువ శాతం వెంకీ ఫ్యామిలీ ఆడియన్స్ కెపాసిటీ అనే చెప్పాలి.
ఇక ఇప్పుడు రెండు మల్టీ స్టారర్ మూవీస్ తర్వాత సోలో మూవీ తో రాబోతున్నాడు వెంకటేష్, తమిళ్ లో ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అసురన్ సినిమా ను తెలుగు లో నారప్ప పేరు తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో…
రూపొందుతున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కానీ లాక్ డౌన్ వలన ఆగిపోయింది, ఆగిపోయే టైం కి 70% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తిరిగి లాక్ డౌన్ తర్వాత షూటింగ్ జరుపుకుంటుంది అని అంతా భావించినా యూనిట్…
భారీ షాక్ ఇప్పుడు ఇచ్చిందని చెబుతున్నారు….ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో షూటింగ్ చేయడం అంత మంచిది కాదని భావించిన టీం…. ఇయర్ ఎండ్ టైం కే తిరిగి షూట్ మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారట. దాంతో ఈ ఇయర్ సమ్మర్ లో రావాల్సిన సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర… వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
సినిమా చాలా వరకు కొన్ని పాత్రల చుట్టే తిరిగే కథే అయినా కానీ యూనిట్ అండ్ క్రూ తో భారీగా జరిగే షూటింగ్ వలన కచ్చితంగా కరోనా మరింత రెచ్చిపోయే అవకాశం ఉన్న నేపధ్యంలో పూర్తిగా తగ్గాకే సినిమా షూటింగ్ లో పాల్గొనాలని ఫిక్స్ అయ్యారట. దాంతో నారప్ప ఈ ఇయర్ లో వచ్చే అవకాశం ఇక లేనట్లే అని ఇండస్ట్రీ లో ఆల్ మోస్ట్ కన్ఫాం చేస్తున్నారు…